పాకెట్ సైజ్‌లో రిమోట్ యాక్సెస్.. ఒక్క క్లిక్‌తో పాప్-అప్ అయ్యే స్టాండ్
చిన్నగా, అరచేతిలో ఇమిడిపోయేలా.. పాకెట్ సైజ్‌లో ఉండే రిమోట్ యాక్సెస్. నొప్పుల నివారణకు ఒకే ఒక్క క్లిక్‌తో పాప్-అప్ అయ్యే స్టాండ్. ఇంకా ఇవేకాకుండా కొత్త గ్యాడ్జెట్లను ఈ వారం నయామాల్లో అందిస్తున్నాం.
నయామాల్
రెట్రో లుక్.. మాడ్రన్ టెక్
డెస్క్‌టాప్ డిజిటల్ గడియారాలు, టెంపరేచర్ మీటర్లు చాలా సాధారణంగా ఉంటాయి. అయితే, ఈ ATuMan Mooda Smart Desktop Thermometer-Hygrometer-Clock మాత్రం.. అందుకు భిన్నంగా కనిపిస్తుంది. క్లాసిక్ వీడియో గేమ్‌ను తలపించే ‘రెట్రో పిక్సెల్-స్టయిల్ డిస్ప్లే’తో వస్తున్న ఈ గ్యాడ్జెట్.. టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. 80-90ల నాటి వీడియో గేమ్స్ కల్చర్‌ను గుర్తు చేసేలా.. ఇందులో ‘పిక్సెల్ ఆర్ట్’ డిస్ప్లేను అమర్చారు. గది ఉష్ణోగ్రత, తేమ శాతాన్ని అంకెల్లోనే కాకుండా, అందమైన యానిమేటెడ్ పిక్సెల్ ఎక్స్ప్రెషన్స్ రూపంలోనూ ఇది చూపిస్తుంది. వాతావరణాన్ని బట్టి స్క్రీన్‌పై సూర్యుడు, చంద్రుడు లేదా రకరకాల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. దీన్ని ఆపరేట్ చేయడానికి చిన్నపాటి ‘మెకానిక్ జాయ్‌స్టిక్స్’ను ఇచ్చారు. దీన్ని కదిలిస్తూ సెట్టింగ్స్ మార్చుకోవడం ఒక సరికొత్త గేమింగ్ అనుభూతిని అందిస్తుంది. గంటల తరబడి కూర్చుని పనిచేసేవారి కోసం ఇది ఎంతో సహాయపడుతుంది.
– ధర: రూ.4,720, దొరుకుచోటు: atuman.com

Atuman Smart Desktop Thermo
గ్యాడ్జెట్స్ మరింత భద్రం!
ప్రయాణాల్లో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు మాత్రమే కాదు.. వాటికి సంబంధించిన చార్జర్లు, పవర్ బ్యాంకులు, కేబుల్స్, ఎస్ఎస్డీలు, మెమరీ కార్డ్ లాంటి ఎన్నో యాక్సెసరీలను వెంట తీసుకెళ్లాల్సిందే! వీటన్నిటినీ ఒకేచోట భద్రపరుచుకోవడం, గజిబిజి కాకుండా సర్దుకోవడం పెద్ద సవాలే! ఈ సమస్య నుంచి బయట పడాలంటే.. PGYTECH Tech Organizer V2 తీసుకోవాల్సిందే! ఈ బ్యాగ్ పూర్తిగా 180 డిగ్రీల కోణంలో తెరుచుకుంటుంది. దాంతో లోపల ఏ గ్యాడ్జెట్ ఎక్కడ ఉందో సులభంగా చూసుకోవచ్చు. దీని లోపలి జేబులను ఒరిగామి పద్ధతిలో డిజైన్ చేశారు. తద్వారా చిన్నచిన్న వస్తువులు కూడా ఇరుకుగా కాకుండా విడివిడిగా, చక్కగా సర్దుకోవడానికి వీలవుతుంది. గ్యాడ్జెట్ ప్రియుల అవసరాలకు తగ్గట్టుగా ఇందులో ప్రత్యేకమైన విభాగాలు ఉంటాయి. వివిధ సైజుల్లో ఉండే ఎలాస్టిక్ బ్యాండ్స్ సహాయంతో చార్జింగ్ కేబుల్స్, ఇయర్ ఫోన్లను చిక్కులు పడకుండా భద్రపర్చవచ్చు. హెవీ-డ్యూటీ వాల్ చార్జర్లు, ల్యాప్‌టాప్ పవర్ బ్యాంక్‌లు, ఎస్డీ కార్డులు, మైక్రో ఎస్డీ కార్డులు, పెన్ డ్రైవ్‌లను దాచుకోడానికి ప్రత్యేకమైన మినీ స్లాట్స్ కూడా ఉంటాయి.
– ధర: రూ. 6,000, దొరుకుచోటు: pgytech.com

Pgytech Tech Organizer V2
స్టాండ్ తీసుకోవాల్సిందే..
ల్యాప్‌టాప్‌పై ఎక్కువగా పనిచేస్తే మెడనొప్పి, వెన్నునొప్పి, భుజాల నొప్పులు రావడం సహజం. ల్యాప్‌టాప్ పొజిషనింగే.. దీనికి ప్రధాన కారణం. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా మార్కెట్లోకి వచ్చింది AULUMU G07 Mini Pop-up Laptop Stand Ultra Thin Folding Portable. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే ఒక్క క్లిక్‌తో ఈ స్టాండ్ పాప్-అప్ అవుతుంది. ల్యాప్‌టాప్‌ను మీకు అవసరమైన ఎత్తుకు, ఎర్గోనామిక్ యాంగిల్‌కు మారుస్తుంది. దాంతో మన చూపు నేరుగా స్క్రీన్‌పైకి వెళ్తుంది. తద్వారా మెడ, వెన్నుపూస సహజమైన స్థితిలో ఉంటాయి. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. టైపింగ్ చేసేటప్పుడు కూడా మణికట్టుపై ఎక్కువ ఒత్తిడి పడకుండా, సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. ల్యాపీ వేడెక్కకుండా కాపాడుతుంది. ఏవియేషన్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారైన ఈ స్టాండ్ చాలా బలంగా ఉంటుంది. ఎక్కువ బరువుండే గేమింగ్ ల్యాపీలను కూడా సులభంగా మోస్తుంది.
– ధర: రూ. 2000, దొరుకుచోటు: అమెజాన్

Aulumu G07 Mini Pop Up Lapt
క్షణాల్లో రిమోట్ యాక్సెస్!
రిమోట్ యాక్సెస్, రిమోట్ టెక్ సపోర్ట్‌లో వచ్చిన టెక్నాలజీ అద్భుతమే.. Comet Q (GL-RMQ1) All-in-One USB Remote KVM with Wi-Fi 6. ఇది ఎంతో చిన్నగా, అరచేతిలో ఇమిడిపోయేలా.. పాకెట్ సైజ్‌లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క యూఎస్బీ-సి కేబుల్ ద్వారా టార్గెట్ డివైజ్ (ల్యాప్‌టాప్/ఐఫోన్)కు దీన్ని కనెక్ట్ చేయవచ్చు. దీనిలో ఉండే ఇంటిగ్రేటెడ్ టచ్‌స్క్రీన్ ద్వారా.. సెట్టింగ్స్‌ను సులభంగా మార్చుకోవచ్చు. సాధారణ వెబ్ బ్రౌజర్ ద్వారానే అవలి వైపు ఉన్న గ్యాడ్జెట్‌ను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చు. వేగవంతమైన కనెక్షన్ కోసం.. ఇందులో అత్యాధునిక వైఫై-6 టెక్నాలజీని వాడారు. దాంతో ఎలాంటి ల్యాగ్ లేకుండా రిమోట్ స్క్రీన్ స్ట్రీమింగ్ సాధ్యమవుతుంది. వీడియో కంటెంట్‌ను చూడటం, మౌస్ కంట్రోల్, క్లిప్‌బోర్డ్ కాపీ-పేస్ట్ ఫీచర్లు చాలా సులువుగా పనిచేస్తాయి. కుటుంబ సభ్యులు, క్లయింట్లకు ఎక్కడి నుంచైనా టెక్ సపోర్ట్ అందించేవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్!
– ధర: రూ. 13,000, దొరుకుచోటు: gl-inet.com

Comet Q (gl Rmq1) All In On
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

