ఐదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతుల గుర్తింపు.. తొలిసారిగా గర్భస్థ శిశువుకు ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’
తూర్పు హిమాలయ ప్రాంత దట్టమైన అడవుల్లో ఐదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటీ పేరేమిటి?. తొలిసారిగా గర్భస్థ శిశువుకు ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’ ద్వారా వెన్నెముక లోపాన్ని సరిచేశారు వంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఈ వారం కరెంట్ మీటర్లో ఇస్తున్నాం.
1) 650కి పైగా సినిమాల్లో నటుడిగా వెండితెరపై నవరసాల్ని పండించి, దర్శక నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించిన టాలీవుడ్ సీనియర్ నటుడు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన పేరేమిటి?
2) తూర్పు హిమాలయ ప్రాంత దట్టమైన అడవుల్లో ఐదు కొత్త రకాల సూక్ష్మ కప్పల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కప్పలు ఏ సమూహానికి చెందినవి?
3) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు?
4) మన దేశంలో కార్పొరేట్ వివాదాలు, దివాలా ప్రక్రియలకు సంబంధించిన అప్పీళ్లను విచారించే నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నూతన చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

Sundar Pichai Jai Shaw
5) ‘హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2026’ విడుదల చేసిన జాబితా ప్రకారం భారతీయుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి అంతర్జాతీయ కంపెనీల విలువ రెండేండ్లలో 53 శాతానికి పెరిగింది. ఆల్ఫాబెట్ ఏకంగా 98 శాతం వృద్ధిని సాధించింది ఈ సంస్థ సీఈవో పేరేమిటి?
6) భారత ప్రభుత్వ, ప్రైవేట్ నౌకలను గుర్తించడంలో భాగంగా ప్రభుత్వ నౌకలకు బ్లూ ఎన్సైన్, ప్రైవేట్ నౌకలకు రెడ్ ఎన్సైన్ ముద్రించాలని నిర్దేశిస్తూ కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ గుర్తులను వేటికి మినహాయించారు?
7) ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికిన ఓ క్రికెటర్ ఇకనుంచి చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు మెంటార్‌గా సేవలు అందించనున్నాడు. ఆ భారత క్రికెటర్ పేరేమిటి?

Dhoni
8) ప్రపంచవ్యాప్తంగా మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని భారత్ సహా 33 దేశాలు వ్యతిరేకించాయి. అనుకూలంగా ఓటు వేసిన దేశాలెన్ని?
9) మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులకు సంబంధించిన కేసులను సత్వరమే విచారించి, బాధితులకు వేగంగా న్యాయం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల’ పథకాన్ని కేంద్రం ఎన్నేండ్లు పొడిగించింది?
10) భారతదేశంలోనే తొలిసారిగా గర్భస్థ శిశువుకు ‘ఓపెన్ ఫీటల్ సర్జరీ’ ద్వారా వెన్నెముక లోపాన్ని విజయవంతంగా సరిచేసిన ఆసుపత్రి పేరేమిటి?
జవాబులు
1. గిరిబాబు (83)
2. జింగోఫ్రిన్
3. జై షా
4. జస్టిస్ రాజేష్ బిందాల్
5. సుందర్ పిచాయ్
6. నౌకాదళం, తీరగస్తీ ఓడలు
7. మహేంద్ర సింగ్ ధోనీ
8. 133
9. ఐదేండ్ల పాటు (2031 మార్చి 31 వరకు)
10. ఎయిమ్స్ (ఢిల్లీ)

Blue Ensign, Red Ensign

Death Penalty
Read Today's Latest Current-affairs News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

