కొలీజియం సిఫార్సు ఒకరికి.. కేంద్రం నియామకం మరొకరికి!
జార్ఖండ్ హైకోర్టు సీజే నియామకంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు సీజే విభు బఖ్రూ పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 24న సిఫార్సు చేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.
- సీజేఐ విచారణ కోరిన జడ్జికే తాత్కాలిక సీజే బాధ్యతలు!
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ హైకోర్టు సీజే నియామకంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు సీజే విభు బఖ్రూ పేరును సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 24న సిఫార్సు చేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.
ఈ నెల 28 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి ఈ నియామకానికి ఆమోదం తెలిపారు. మరోవైపు, ప్రసాద్‌పై వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గతంలోనే ఆరా తీశారు. ఆయన నిష్పాక్షికత, సమగ్రతపై వచ్చిన ఫిర్యాదులపై వాస్తవ నివేదిక ఇవ్వాలని అప్పటి జార్ఖండ్ సీజే సోనక్ను కోరారు. ఈ నెల 25 నాటికి విచారణ కొనసాగుతున్నదని నివేదికపై స్పష్టత రాలేదని బార్ అండ్ బెంచ్ వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

