మేము చనిపోయాము.. మా పేర్లు తొలగించండి
కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ కనీసం 37 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తాము మరణించామని పేర్కొంటూ వారు ఈ దరఖాస్తులు సమర్పించారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి పేరు, తొలగించాల్సిన పేరు ఒకటేనని, అంతేగాకుండా వారి పేర్లలోని మొదటి అక్షరాలు(ఇంటి పేర్లు) కూడా సరిపోలుతున్నట్టు తెలుస్తున్నది. మరో విచిత్రమైన ఉదంతంలో 334 జంటలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు మరణించినట్టు ప్రకటించుకున్నారు.
- ఫామ్-7లో పేర్కొన్న 37 మంది ఓటర్లు
- పరస్పరం పేర్ల తొలగింపు కోసం 334 జంటల దరఖాస్తులు
- కర్ణాటక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్షలోవిస్తుపోయే వింతలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కర్ణాటక ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని కోరుతూ కనీసం 37 మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. తాము మరణించామని పేర్కొంటూ వారు ఈ దరఖాస్తులు సమర్పించారు. అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి పేరు, తొలగించాల్సిన పేరు ఒకటేనని, అంతేగాకుండా వారి పేర్లలోని మొదటి అక్షరాలు(ఇంటి పేర్లు) కూడా సరిపోలుతున్నట్టు తెలుస్తున్నది. మరో విచిత్రమైన ఉదంతంలో 334 జంటలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు మరణించినట్టు ప్రకటించుకున్నారు. ఒక వ్యక్తి అవతలి వ్యక్తి మరణించాడని పేర్కొంటూ ఆ వ్యక్తి పేరును తొలగించాల్సిందిగా ‘ఫామ్-7’ను సమర్పించగా, మరణించినట్టు పేర్కొన్న ఆ రెండో వ్యక్తి కూడా అదే తరహా ఫామ్‌ను సమర్పించి, మొదటి వ్యక్తి మరణించినట్టు ప్రకటించారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) డాటాను మ్యాండేట్ ఎనలిటిక్స్ అండ్ కన్సల్టింగ్(మ్యాక్-ఇన్సైట్స్) సంస్థ విశ్లేషించగా ప్రతి జంటలోని ఇద్దరు వ్యక్తులు ఒకే పోలింగ్ కేంద్రంలో నమోదై ఉన్నారని తేలింది.
ముసాయిదా జాబితాలో చేరికలు
కర్ణాటక అంతటా జూన్ 30న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ ప్రారంభం కాకముందే మరణాన్ని కారణంగా పేర్కొంటూ తమ పేర్లను తొలగించవలసిందిగా కోరే దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చాయి. అయితే ఓటర్ల ముసాయిదా జాబితాలు ప్రచురితమైన తర్వాత కూడా కనీసం మూడు అటువంటి దరఖాస్తులు అందాయి. అంటే ఆ పేర్లు ముసాయిదా జాబితాలలో కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల గురించి బూత్ స్థాయి అధికారులు(బీఎన్ఓ), సహాయ ఎన్నికల నమోదు అధికారులను(ఏఈఆర్ఓ) సంప్రదించగా వారు కూడా వీటిని ధృవీకరించారు. ఈ ఘటనలు మాగడి, సండూరు, బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో చోటుచేసుకోగా వీటికి సంబంధించిన దరఖాస్తు ఫామ్‌లను సెప్టెంబర్ 17 నుంచి 26 మధ్య సమర్పించారు.
విచిత్ర జంటల ఉదంతాలు
ఒకరినొకరు మరణించినట్టు ప్రకటించుకున్న 334 జతల ఓటర్లు 25కు పైగా జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ఇటువంటి కేసుల్లో అత్యధికంగా బెళగావిలో 160, ఆ తర్వాత కలబురిగిలో 80 కేసులు నమోదయ్యాయని మ్యాక్ ఇన్సైట్స్ విశ్లేషించిన డాటా వెల్లడించింది. మే 14న సర్ అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ కేసులన్నీ దాఖలయ్యాయి.
పరస్పర ఓటు రద్దు
వివరాలను సరిచూసేందుకు ఫామ్-7లోని నమోదులను ఫారమ్-10లతో(ఇవి ఫామ్-7కు సంబంధించిన రోజువారీ సమగ్ర నివేదికలు) పోల్చి చూడగా దిగ్భ్రాంతిని గొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఉదాహరణకు మే 17న బెళగావి జిల్లాలోని రాయ్‌బాగ్‌లో గంగుబాయి వడ్డార్ అనే ఓటరు, రుక్మిణి వడ్డార్ మరణించారని పేర్కొంటూ ఆమె పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అదే రుక్మిణి వడ్డార్ కూడా ఒక ఫామ్‌ను సమర్పించి గంగుబాయి వడ్డార్ మరణించారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

