Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. భారత్‌పై మరోసారి సుంకాలు (Tariffs) పెంచుతానని ట్రంప్ హెచ్చరించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన స్టాక్స్ సూచీలపై ఒత్తిడి పెంచాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 85,640.05 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 85,762.01) నష్టాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్ మొదట్లో కాసేపు లాభాల్లోకి వచ్చిన సూచీ.. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 85,315.33 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 322.39 పాయింట్ల నష్టంతో 85,439.62 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 23,600 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 90.28గా ఉంది.
అదేవిధంగా అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 60.76 వద్ద కొనసాగుతుండగా.. బంగారం 4,435 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌గా.. బీఈఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. సెన్సెక్స్ టాప్ లూజర్స్‌గా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ సూచీలు ఉన్నాయి.