Anaganaga Oka Raju | జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). మారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్ననేపథ్యంలో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశారు.
నవీన్ పొలిశెట్టి ఊయలపై కింగ్ స్టైల్లో స్టైలిష్‌గా కూర్చున్న లుక్‌ను విడుదల చేస్తూ.. మా రాజు గారు వస్తున్నారు దరువేసుకోండ్ర.. అంటూ దండోరా వేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇంటింటా నవ్వుల మోతె.. అని చెబుతూ అనగనగా ఒక రాజు టైలర్‌ను జనవరి 7 సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి సింగర్‌గా కూడా మారబోతున్నాడని తెలిసిందే. నవీన్ పొలిశెట్టి ఇందులో భీమవరం బల్మా పాటను పాడాడు. పండగకు స్టెప్పులు వేయడానికి రెడీగా ఉండండి.. లో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.
మా రాజు గారు వస్తున్నారు దరువేసుకొండ్ర… 🥳#AnaganagaOkaRaju Trailer out on JAN 7th at 6:04PM ❤️
ఈ సంక్రాంతికి ఇంటింటా నవ్వుల మోతె… 😎#AOR in Cinemas Worldwide on JAN 14th, 2026.💥💥💥#NaveenPolishetty4 #AOROnJan14th
Star Entertainer @NaveenPolishety @Meenakshiioffl… pic.twitter.com/g2OR1k1wLR
— BA Raju’s Team (@baraju_SuperHit) January 5, 2026
అనగనగా ఒక రాజు ప్రీ వెడ్డింగ్ వీడియో..
రాజుగారి పెళ్లి విందులో చమ్మక్ చంద్ర అరేయ్ ఇది రాజుగారి పెళ్లి.. గెస్టులందరికీ గోల్డ్ ప్లేట్స్ మాత్రమే పెట్టండి.. అంటూ చెప్పే డైలాగ్స్‌తో మొదలైంది ప్రీ వెడ్డింగ్ వీడియో. అతిథుల్లో ఓ వ్యక్తి ఏంటండి వీళ్లు ప్లేటు గోల్డ్.. స్వీటు గోల్డ్ అంటున్నారు.. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ల పెళ్లా అని అడుగుతుంటే.. మరో వ్యక్తి ఏవండి ఇది మా రాజుగారి పెళ్లండి అని అంటున్నాడు.
నవీన్ పొలిశెట్టి ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తూ.. ముఖేశ్ అంబానీకి ఫోన్ చేసి.. ముఖేశ్ మామయ్యా ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీల ఫోన్ నంబర్లు పెట్టు చెబుతా.. ఈ ఇయర్ అంతా అంబానీ పెళ్లి.. వచ్చే ఏడాదంతా రాజుగారి పెళ్లి అంటున్నాడు. జాతి రత్నాలు హీరో స్టైల్ ఆఫ్ హ్యూమర్ టచ్‌తో సాగుతున్న వీడియో సినిమాపై అంచనాలు అమాంతం చేస్తోంది.