న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ తన చరిత్రలో మరో అతి పెద్ద ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టనుంది. కృత్రిమ మేధ వల్ల నిర్వహణ ఖర్చులు పెరుగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థలోని అన్ని వ్యాపార యూనిట్లలో కలిపి 20 వేల నుంచి 30 వేల మందిని తొలగించే అవకాశం ఉంది.
ఈ నెలలోనే లేఆఫ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏఐ డాటా కేంద్రాల నిర్మాణం కోసం భారీ పెట్టుబడులు అవసరమైన నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా అనవసరం అనిపించే ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకొని ఈ తొలగింపులు జరగొచ్చని విశ్వసనీయ వర్గాలు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపాయి.