PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
PM AP visit | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరగనున్న 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఏర్పేడులోని ఐసర్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
PM AP visit : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జరగనున్న 61వ అఖిల భారత పోలీసు ఉన్నతాధికారుల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఏర్పేడులోని ఐసర్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు మూడు రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డిసెంబర్ 4న రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకనున్నారు. అనంతరం ప్రధాని ఐసర్ కేంద్రానికి చేరుకుని అక్కడే రాత్రి బస చేయనున్నారు. డిసెంబర్ 5న ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీసు సదస్సులో 6న మధ్యాహ్నం 3.30 గంటల వరకు అక్కడే జరిగే వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు.
డిసెంబర్ 6న సాయంత్రం 5.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధాని తిరుగు పయనం కానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీభద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఐపీఎస్ అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ సవాళ్లపై సదస్సులో కీలక చర్చలు జరుపనున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, అక్రమ రవాణాపై ప్రత్యేక చర్చ చేపట్టనున్నారు. ఉగ్రవాద ముప్పు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణపై సమీక్షించనున్నారు. పోలీసు వ్యవస్థలో ఏఐ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై చర్చించనున్నారు.
డిసెంబర్ 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటలకు యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ యోగా కార్యక్రమాల్లో ప్రధాని మోదీతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

