NTR -Neel |మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే ఈ మూవీకి సంబంధించిన చిన్న అప్డేట్ బయటకు వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ సినిమాను పూర్తిగా ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ గట్టిగా నిర్ణయించుకున్నారట. తన అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌కు కెరీర్లో మరిచిపోలేని బ్లాక్‌బస్టర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన ఎక్కడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న చిన్న డిటైలింగ్ వరకు కూడా పర్ఫెక్షన్ కావాలనే ఆలోచనతో ప్రతి సీన్‌ను తెరకెక్కిస్తున్నారట.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా దీనిని అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా తీసుకుంది. ఇటీవల నిర్మాత రవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదాహరణగా మారింది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రల మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు, ఎన్టీఆర్‌తో ఒక పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ఈ షెడ్యూల్లోనే తెరకెక్కించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యాక ఎన్టీఆర్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారని తెలుస్తోంది. అక్కడ జరిగే షెడ్యూల్‌తో సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తవుతుందని టాక్. గ్రాండ్ స్కేల్లో, భారీ యాక్షన్ ఎపిసోడ్లతో ఈ మూవీని ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా అందించేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవల్లో సెట్ అయ్యే కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ గత సినిమాల్లో హీరో ఎలివేషన్స్, మాస్ యాక్షన్‌కు పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కేవలం హీరోయిజం మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటనలోని ఎమోషనల్ డెప్త్‌ను కొత్త కోణంలో చూపించాలనే ప్రయత్నంలో ప్రశాంత్ నీల్ ఉన్నారట.