Telangana | హైదరాబాద్ : చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని కోర్టు ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 3 లక్షల 80 వేల వీధి కుక్కలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని తెలిపింది. రహదారులపై వ్యర్థాల వల్లే కుక్కల స్వైరవిహారం ఎక్కువైందని కోర్టు పేర్కొంది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
KTR | డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా: కేటీఆర్
Niranjan Reddy | అసలు రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Job Aspirants | జన్మలో కాంగ్రెస్కు ఓటెయ్యం.. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతం: నిరుద్యోగులు