Narsimhulapeta | ఉదయం11 దాటినా ఆఫీసుకు రాని అధికారులు.. ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిపై ప్రజల ఆగ్రహం
Narsimhulapeta | మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కార్యాలయానికి ఒక్క అధికారి కూడా రాలేదని మండిపడుతున్నారు.
Narsimhulapeta | నర్సింహులపేట, మార్చి 9: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలు దాటినా కార్యాలయానికి ఒక్క అధికారి కూడా రాలేదని మండిపడుతున్నారు.
అధికారులు సమయానికి రాకపోవడంతో వివిధ పనుల మీద గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు గంటల తరబడి ఎంపీడీవో కార్యాలయం వద్ద వేచిచూడాల్సి వస్తుంది. కేవలం తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి హాజరయ్యారు. ఎంపీడీవో కార్యాలయంలో కీలక పాత్ర పోషించే ఎంపీడీవో, ఎంపీ ఓ, సూపర్డెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సైతం సమయపాలన పాటించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు.
గత కొద్ది రోజులుగా అధికారుల సమయపాలన తీరు ఇదే విధంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పలు సార్లు అధికారులను, కార్యాలయ సిబ్బందిని వివరణ కోరగా పొంతన లేని సమాధానం చెబుతున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

