Rayapol | రాయపోల్, మార్చి 9: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని వరుసగా రెండోసారి కలాం వరల్డ్ రికార్డు సాధించింది.
దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి గ్రామానికి చెందిన పంజాల కార్తీక బేగంపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగగతి చదవుతున్నది. ఇటీవల ఆన్లైన్ వేదికగా నిర్వహించిన పోటీల్లో ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను, వాటి సంకేతాలను, పరమాణు భారాలకు కార్తీక కేవలం 35 సెకండ్లలో చెప్పి రికార్డు నెలకొల్పింది. దీంతో నిర్వాహకులు కార్తీకకు కలాం వరల్డ్ రికార్డు అవార్డును ప్రకటించారు.
ఈ అవార్డును ఆదివారం సాయంత్రం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కార్తీకకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కార్తీకను గౌడ్ టీచర్ భాస్కర్ రెడ్డి, బేగంపేట పాఠశాల హెడ్ మాస్టర్ ప్రమీల, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.