తొగుట : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన కొక్కొండ లక్ష్మీనారాయణ సతీమణి వజ్రమ్మ (80) అకాల మరణం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ బండారు కవితతో కలిసి ఆమె భౌతిక కాయనికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తనవంతుగా రూ.3000వేల ఆర్థిక సహాయం అందించారు.
వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో ఉప సర్పంచ్ లచోళ్ల లింగం, వార్డు సభ్యులు మిద్దె శ్రీనివాస్, నాయకులు సుతారి రాములు, కొక్కొండ సురేష్, ఈదుగళ్ల పర్శరాములు,సింగోజీ కృష్ణ, పాత్కుల బాలయ్య, లింగంపేట లింగం, బెజ్జనమైన సందీప్, బెజ్జనమైన నవీన్, పిట్ల రాములు, రేపాక నాగయ్య, వడ్ల రాజేందర్ తదితరులు ఉన్నారు.