Red Alert | తెలంగాణ అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.
Red Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే రెండుమూడు రోజుల్లో బలపడి వాయువ దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. కరీంనగర్ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

