Telangana | విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించిన ఊర్కొండపేట రైతులు
Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana | మహబూబ్‌నగర్ : జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఊర్కొండపేట గ్రామంలో నిరాంతరాయంగా విద్యుత్ కోతలు ఉన్నాయి. అధికారులను సంప్రదిస్తే.. చిన్నచిన్న కారణాలు సాకు చూపుతూ గంటల తరబడి.. అంటే దాదాపు ఏడు నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ కోతల వల్ల రైతులతో పాటు పాడి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కరెంట్ సమస్యలపై అధికారులకు ఫోన్లు చేస్తే కనీసం స్పందించడం లేదు. లైన్మెన్లు కూడా స్పందించడం లేదు. వర్షాలు సరిగా లేక కరెంట్ అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్ కోతలను నియంత్రించి నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.
విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
మహబూబ్ నగర్ – జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలంలోని జాకినాల పల్లి సబ్ స్టేషన్ ముందు ఉర్కొండ పేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు.
గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల… pic.twitter.com/sfa1CQZJNq
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2024
ఇవి కూడా చదవండి..
Red Alert | తెలంగాణ అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Telangana Assembly | ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు.. 25 లేదా 26న బడ్జెట్..!
Traffic SI | జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు..
Telangana | చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

