సోమవారం 13 జూలై 2020
Telangana - May 26, 2020 , 01:52:43

గింత త్వరగా పూర్తయిద్దనుకోలె

గింత త్వరగా పూర్తయిద్దనుకోలె

  • కొండపోచమ్మసాగర్‌పై సీఎంతో మర్కూక్‌ సర్పంచ్‌
  • జలాశయం ప్రారంభంపై స్వయంగా కేసీఆర్‌ ఫోన్‌

గజ్వేల్‌ అర్బన్‌: కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరాతీశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ సర్పంచ్‌ భాస్కర్‌కు సోమవారం స్వయంగా ఫోన్‌చేసి ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొండపోచమ్మసాగర్‌పై స్థానికంగా ప్రజల ఒపీనియన్‌ ఏమిటంటూ తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ‘ఇంత త్వరగా పూర్తయినందుకు అందరూ సంతోషపడుతున్నరు సార్‌. కలల కూడా అయితదనుకోలేదని అంటున్నరు’ అంటూ భాస్కర్‌ సమాధానమిచ్చారు. 

సీఎం: భాస్కర్‌ బాగున్నావా.. మర్కూక్‌ ఎట్లుంది. ఏవైనా పనులు పెండింగ్‌లో ఉన్నయా.

భాస్కర్‌: నమస్కారం సార్‌, పెండింగ్‌లో ఏమీ లేవు సార్‌, మీ దయవల్ల అన్నీ జరిగిపోతున్నాయి. 

సీఎం :కొండపోచమ్మ సాగర్‌ పూర్తయింది కదా పబ్లిక్‌ ఒపీనియన్‌ ఎట్లుంది.. ఏమంటున్నారు.

భాస్కర్‌: ఇంత తొందరగా పూర్తయినందుకు అందరూ సంతోషపడుతున్నరు సార్‌. కలల కూడా అయితదనుకోలేదని అంటున్నరు.

సీఎం: కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభానికి 1500 మందికి భోజనాలు ఏర్పాటుచేయాలి. నా పీఏ వస్తడు. స్థలం పరిశీలించి చదును చేయాలి. ఇంకా 14 ఎకరాల్లో పబ్లిక్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకుందాం. 

సీఎం: కస్తూర్బా హాస్టల్‌ చూసినవా.

భాస్కర్‌: చూసిన సార్‌

సీఎం : దానికి ఎదురుగా రైతు వేదిక భవనం కూడా కట్టుకుందాం. భూమి సర్వే పూర్తయింది. ఇంకా ఏమన్నా కావాలా.

భాస్కర్‌: మండల హెడ్‌క్వార్టర్‌ కదా సార్‌.. మోడల్‌ గ్రామపంచాయతీ భవనం కావాలి సార్‌.

సీఎం: రూ.6 కోట్లు సాంక్షన్‌ చేద్దాం. ప్లానింగ్‌ రెడీ చేసుకో. బా గా పని చేస్తున్నా వ్‌. ఇంకా మం చిగ కష్టపడు. దగ్గరుండి చేసుకో. 

భాస్కర్‌: ఒకే సార్‌.

 చెక్‌డ్యాంలు నింపుకోండి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్కూక్‌ మండలం చేబర్తి సర్పంచ్‌ అశోక్‌కు కూడా ఫోన్‌చేసి మాట్లాడారు. ‘రేపు మన చేబర్తి చెరువును ఏదో ఒక సమయంలో నింపుతరు. నేను ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డితో చెప్పిన.. ఆయనతో మాట్లాడి ఏమిచేయాలో చూడండి. చెరువు మత్తడి దుం కిన తరువాత అన్ని చెక్‌డ్యాంలు నింపుకోండి. కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, గ్రామస్థులు అందరినీ పిలువండి’ అని సూచించారు.


logo