సినిమా టైటిల్ చెబుతావా చెప్పవా అని ఆ నటుడు డైరెక్టర్‌ను అడిగాడు. నేను చెప్పను అని అన్నాడు ఆ డైరెక్టర్. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ నటుడు ఒక్కసారి డైరెక్టర్‌ను గొంతు పట్టి పైకి ఎత్తి కుదేశాడు. అంతేకాదు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేశాడు. ఆ నటుడి పేరు సిద్ధాంత్ చతుర్వేది కాగా ఆ డైరెక్టర్ పేరు శకున్ బాత్రా. అయితే ఇదేదో సీరియస్‌గా జరిగిన వ్యవహారం మాత్రం కాదు. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం. ఈ వీడియోను సిద్ధాంత్.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మరోసారి విఫలయత్నం చేశాను. అప్పటి వరకూ ఈ మూవీని శకున్ బాత్రా తర్వాతి మూవీ అనాల్సిందే అని కామెంట్ చేశాడు.
ఇదే మూవీలో సిద్ధాంత్ పక్కన నటిస్తున్న కత్రినా కైఫ్ కూడా ఈ సరదా వీడియోపై స్పందించింది. అయ్యో, సిద్ధాంత్ ఫ్యాన్స్ కూడా టైటిల్ డిమాండ్ చేస్తున్నారు అని ఆమె కామెంట్ చేసింది. అవును మాకు టైటిల్ రివీల్ చేయండి అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. ఈ మూవీలో దీపికా పదుకోన్, అనన్యా పాండే కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లాక్డౌన్ తర్వాత గోవా, ముంబైలలో జరిగింది. గతంలో పీకూ, తమాషా, లవ్ ఆజ్కల్లాంటి డిఫరెంట్ జానర్ మూవీస్ అందించారు శకున్ బాత్రా.
ఇవికూడా చదవండి..
మమతా బెనర్జీ తప్పుడు ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాషింగ్టన్ సుందర్ కుక్క పేరు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా