రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా

చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ టీమ్ ఎమర్జింగ్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఈసారి బెంగళూరు టీమ్ అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గతేడాది టోర్నీలోనూ పడిక్కల్ నిలకడగా రాణించాడు. ఈ మధ్యే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పడిక్కల్‌కు కరోనా ఆ టీమ్‌కే కాదు ఐపీఎల్ నిర్వాహకులకు కూడా మింగుడు పడనిదే.
ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్ కూడా శనివారం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇక ఇంతకుముందు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ నితీష్ రాణా.. దాని నుంచి కోలుకొని మళ్లీ టీమ్‌తో చేరాడు. అటు చెన్నై సూపర్ కింగ్స్‌ను కరోనా వదల్లేదు. కంటెంట్ టీమ్‌లోని సభ్యుడు ఒకరు కరోనా బారిన పడ్డాడు. గతేడాది యూఏఈలో టోర్నీ సందర్భంగానూ చెన్నై టీమ్‌ను కరోనా కలవరపెట్టింది. ఢిల్లీ, చెన్నై మధ్య మ్యాచ్‌కు వేదికైన వాంఖడే స్టేడియంలో సిబ్బంది కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్లేయర్స్‌కు కూడా ఈ మహమ్మారి సోకుతుండటం నిర్వాహకులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
రేపటి నుంచి 71 అన్రిజర్వ్డ్ రైలు సర్వీసులు
‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు
బ్యాటరీ లైఫ్ 28 వేల ఏండ్లు!
ఉసురు తీసి.. ప్రాణం పోసి..
రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
థియరీ తర్వాత ప్రాక్టికల్స్
పసి పెద్దలకు మాత్రమే!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

