e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home అంతర్జాతీయం ఉసురు తీసి.. ప్రాణం పోసి..

ఉసురు తీసి.. ప్రాణం పోసి..

ఉసురు తీసి.. ప్రాణం పోసి..

డైనోసార్ల వినాశనానికి కారణమైన గ్రహశకలంవల్లే అమెజాన్‌ అడవుల ఆవిర్భావం!
పనామా: ఆరున్నర కోట్ల ఏండ్ల క్రితం 12కిలోమీటర్ల వెడల్పున్న ఓ భారీ గ్రహశకలం భూగ్రహాన్ని ఢీకొట్టడంవల్ల డైనోసార్లు అంతరించిపోయాయన్న వాదనను చాలామంది శాస్త్రవేత్తలు ఆమోదిస్తారు. అమెజాన్‌ అడవుల ఆవిర్భావానికీ అదే గ్రహశకలం కారణమై ఉండొచ్చని తాజాగా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అది భూమిని ఢీకొట్టడం వల్ల జరిగిన మార్పులతో దక్షిణ అమెరికా ఖండంలోని ఉత్తర భాగంలో భారీ వృక్ష సంపద పెరిగిందని చెబుతున్నారు. ఆ కాలానికి సంబంధించిన 50,000 మొక్కల పుప్పొడి, 6 వేల ఆకుల శిలాజాలపై పరిశోధనలు జరిపామని పనామాలోని స్మిత్‌సోనియన్‌ ట్రాపికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మోనిక కార్వల్హో తెలిపారు. గ్రహశకలం సృష్టించిన విధ్వంసానికి ఎన్నో వృక్షజాతులు నాశనమైపోయినా కొత్తవి కూడా పుట్టాయన్నారు. అవే కాలక్రమేణా అమెజాన్‌ అడవులుగా పరిణామం చెందవచ్చని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి :

బ్యాటరీ లైఫ్‌ 28 వేల ఏండ్లు!

‘క్యాపిటల్‌’ వద్ద కారు బీభత్సం

రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు

Advertisement
ఉసురు తీసి.. ప్రాణం పోసి..

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement