e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home అంతర్జాతీయం ‘క్యాపిటల్‌' వద్ద కారు బీభత్సం

‘క్యాపిటల్‌’ వద్ద కారు బీభత్సం

‘క్యాపిటల్‌' వద్ద కారు బీభత్సం

ఒక పోలీసు మృతి.. మరొకరికి గాయాలు
పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం: అమెరికాలో కలకలం

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 3: అమెరికా చట్టసభల వేదిక అయిన వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ భవనం వద్ద మరోసారి కలకలం రేగింది. భవనం ఆవరణలోని భద్రతా సిబ్బందిపైకి ఓ దుండగుడు కారుతో దూసుకువచ్చిన ఘటనలో ఓ పోలీసు అధికారి మరణించగా.. మరొకరు గాయపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం భవనం వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులపైకి ఓ కారు దూసుకువచ్చింది. అనంతరం చేతిలో కత్తిని పట్టుకుని నిందితుడు కారు నుంచి దిగి పోలీసుల మీదకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. నిందితుడిని 25 ఏండ్ల నోహ్‌ గ్రీన్‌గా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉన్నదన్నారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. దవాఖానలో చికిత్స పొందుతూ ఒక అధికారి మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

ఇవి కూడా చదవండి :

బ్యాటరీ లైఫ్‌ 28 వేల ఏండ్లు!

రోబో వేసిన పెయింటింగ్‌కు రూ.5 కోట్లు

ఉసురు తీసి.. ప్రాణం పోసి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘క్యాపిటల్‌' వద్ద కారు బీభత్సం

ట్రెండింగ్‌

Advertisement