ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
బ్యాంకులు ఎఫ్డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏంచేయాలి

పెట్టుబడిదారులు అమితంగా ఇష్టపడే పొదుపు సాధనాల్లో స్థిర డిపాజిట్స్ (ఎఫ్డీ) ఒకటి. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడి, మూలధనం భద్రతకు హామీ ఇస్తుంది. అయినప్పటికీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.
కొన్ని బ్యాంకులు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు ఎఫ్డీలపై టీడీఎస్‌ను కొంతవరకు తగ్గిస్తాయి. అయితే, బ్యాంకులు ఎఫ్డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏంచేయాలి..?
మీరు ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే.. మీరు సంపాదించిన వడ్డీపై టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. వివిధ ఎఫ్డీలపై బ్యాంకులు 10 శాతం చొప్పున టీడీఎస్‌ను తగ్గించుకొంటాయి. ఒకవేళ డిపాజిటర్ శాశ్వత ఖాతా నంబర్ (పాన్) సమర్పించడంలో విఫలమైనపక్షంలో.. బ్యాంక్ 20 శాతం చొప్పున టీడీఎస్‌ను తీసివేస్తుంది.
టీడీఎస్‌ను తీసివేయకుండా బ్యాంకులను నిరోధించడానికి మీరు చేయాల్సిందల్లా.. మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని బ్యాంకుకు తెలియజేయాలి. ఫారం 15 జీ లేదా 15 హెచ్ ను బ్యాంకుకు సమర్పించాలి. ఇవి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలు. దీనిలో మీ ఆదాయం మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నదని మీరు నిర్ధారించాలి.
60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి రూ.2.5 లక్షల లోపు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏండ్ల వయసు పైబడిన వారు, 80 ఏండ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది. 80 ఏండ్ల వయసు పైబడిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఇస్తారు.
ఈ ప్రయోజనం కోసం 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి ఫారం 15 జీ , 60 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫారం 15 హెచ్ .. రెండు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంలు అందుబాటులో ఉన్నాయి.
సంబంధిత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీరు ఈ ఫారాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. 2022 ఆర్థిక సంవత్సరంలో టీడీఎస్‌ను నివారించడానికి మీరు ఇప్పుడు ఫారాలను సమర్పించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. మీకు డిపాజిట్ ఉన్న ప్రతి బ్యాంకులో ఇది సమర్పించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

