డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్‌కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది

హైదరాబాద్: డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్‌కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది.
ఈ పరికరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసేలా రూపొందించారు. డ్రైవర్ నిద్రావస్థలో ఉన్నట్లు కనిపించగానే అలారం మోగడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత ప్రమాద నివారణ వ్యవస్థ, సివిల్ డొమైన్లో తగిన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు.
ఈ పరికరం వాహనం డాష్‌బోర్డ్‌లో అమర్చడానికి ఉద్దేశించినది. డ్రైవర్ కండ్లను పర్యవేక్షించడానికి సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఒక నిర్దిష్ట కాలానికి కండ్లు మూసివేయగానే అలారం మోగుతుంది. ఈ పరికరం డ్రైవర్ నిర్లక్ష్యాన్ని కొంతవరకు నిరోధించగలదని, రోడ్డు ప్రమాదాలను నివారించగలదని ఎంసీఈఎంఈ భావిస్తున్నది.
టెక్నాలజీతో పాటు ప్రోటోటైప్‌ను ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌కు కల్నల్ కమాండెంట్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్ అందజేశారు. ఈ ప్రాజెక్టులో ఎంసీఈఎంఈతో సహకరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా కూడా హాజరయ్యారు.
ఈ ప్రాజెక్టును మూల్యాంకనం చేస్తామని, రాష్ట్రంలో నడుస్తున్న భారీ వాహనాల ఉపయోగం కోసం ఈ పరికరాన్ని పరిగణనలోకి తీసుకునేలా ప్రాంతీయ రవాణా అథారిటీ (ఆర్టీఏ) తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో హ్యాకథాన్లను నిర్వహించడానికి ఎంసీఈఎంఈ, టిటా మరింత సహకరించుకుంటాయని సందీప్ మక్తాలా చెప్పారు. ఎంసీఈఎంఈ దాదాపు 15 ప్రాజెక్టులు అభివృద్ధి చేసిందని, అయితే ఈ ఏఐ- ఆధారిత ప్రమాద నివారణ వ్యవస్థ చాలా మంచి ప్రాజెక్టు అని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరికరానని ఆర్టీసీ బస్సులు లేదా ఇతర ప్రజా రవాణా విధానాలకు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చునని సందీప్ మక్తాలా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
Ramayana | ‘రామాయణ’పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు.. బాలీవుడ్ స్టార్స్ మాత్రం ఎందుకు మౌనం, ఇండస్ట్రీలో కొత్త చర్చ!
Iodine tablets | ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. ఎందుకో తెలుసా..?
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

