లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
ఓ చిలిపి కుక్క రష్యాలో లైవ్‌లో ఉన్న రిపోర్టర్ మైక్రోఫోన్‌ను ఎత్తుకుని పరుగు లంకించుకుంది

కుక్కులు తమ అల్లరి పనులతో అందర్నీ తమవైపునకు తిప్పుకుంటుంటాయి. ఇండ్లలో పెంపుడు శునకాలు చేసే అల్లరితో మనం ఎంతో ఉపశమనం పొందుతుంటాం. అయితే, ఒక్కోసారి వీటి అల్లరి శ్రుతిమించిపోవడంతో తలనొప్పులు కూడా వస్తుంటాయి. అలాంటి ఓ చిలిపి కుక్క రష్యాలో లైవ్‌లో ఉన్న రిపోర్టర్ మైక్రోఫోన్‌ను ఎత్తుకుని పరుగు లంకించుకుంది.
రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ నడేజ్డా సెరెజ్కినా.. వాతావరణంపై లైవ్‌లో నివేదిక అందిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఓ కుక్క ఆమెపైకి అమాంతం ఎగిరి ఆమె చేతిలోని మైక్రోఫోన్‌ను నోట కరుచుకుని పరుగు లంకించుకుంది.
కుక్కను పట్టుకునేందుకు రిపోర్టర్ నడేజ్డా కూడా పరిగెత్తింది. చివరకు కుక్కును పట్టుకున్న రిపోర్టర్.. దాని నోట్లో ఉన్న మైక్రోఫోన్‌ను తిరిగి సాధించింది.
లైవ్ వార్తలను చూస్తున్న వారంతా.. మైక్రోఫోన్‌ను కుక్క నోట కరుచుకోవడం.. మైక్రోఫోన్ కోసం రిపోర్టర్ కుక్క వెంట పరిగెత్తడం చూసి నవ్వుకున్నారు. లైవ్‌లో కుక్క ఎపిసోడ్ మధ్యలో రావడంతో యాంకర్ ఎలినా డాష్కువా వెంటనే తేరుకుని వాతావరణం వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేసింది.
ఈ వీడియోను అలీ ఓజ్కోక్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మైక్‌పై కుక్క దంతాల గుర్తులు ఉన్నట్లు టీవీ ఛానల్ సిబ్బంది గుర్తించారు.
సరదాగా కాస్సేపు నవ్వుకోవడానికి పనికొచ్చే ఈ వీడియో ట్వి్టర్లో వైరల్ కావడంతో నెటిజెన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రష్యాలో కుక్కలు ఇంటర్వ్యూ చేస్తాయి.. రిపోర్టర్ అని కుక్కకు బహుషా తెలిసి ఉండదు.. అంటూ నెటిజెన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
A dog in Russia grabbed the reporter's microphone and ran away during a live broadcast pic.twitter.com/R1T8VZ5Kpt
— Dennis Kurt | Defense Observer (@byz_observer) April 2, 2021
ఇవి కూడా చదవండి..
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

