e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home తెలంగాణ గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు

గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు

గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
  • మరణాలన్నీ కరోనావేనంటూ తప్పుడు కథనాలు
  • ప్రజలను భయాందోళనకు గురిచేసే కుట్ర ఇది
  • కొవిడ్‌ సోకినా దీర్ఘకాలిక రోగాల వల్లనే మరణాలు
  • చివరి క్షణాల్లో గాంధీకి వచ్చే కేసులు 40-50 శాతం
  • పత్రిక కథనంపై గాంధీ దవాఖాన వైద్యుల వివరణ

ప్రైవేటు దవాఖానలో గుండె సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించడంతో.. అతడి బంధువులు గాంధీ దవాఖానకు తీసుకొచ్చారు. దవాఖానకు వచ్చిన ప్రతి రోగికి కొవిడ్‌ పరీక్షలు చేయాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఆ వ్యక్తికి పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని కొవిడ్‌ వార్డులోని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా ఈ నెల ఒకటిన మృతి చెందాడు.

మరో వ్యక్తికి ప్రైవేట్‌ దవాఖానలో బ్రెయిన్‌ సర్జరీ కావడంతో కోమాలోకి వెళ్లాడు. అతడిని ఆ స్థితిలోనే గాంధీ దవాఖానకు తరలించారు. అయినప్పటికీ ప్రభుత్వ వైద్యులు తిరస్కరించకుండా అతడిని చేర్చుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి కూడా ఈ నెల ఒకటో తేదీన మరణించాడు. కరోనా పరీక్షల్లో అతడికి కూడా పాజిటివ్‌ వచ్చింది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఏప్రిల్‌ 3 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానకు వస్తున్న కేసుల్లో 40- 50శాతం వరకు ఇటువంటివేనని వైద్యులు చెప్తున్నారు. వీటిని కరోనా మరణాలు అనడానికి ఆస్కారం లేదని వివరించారు. విషమ పరిస్థితుల్లో వచ్చిన రోగులకు కరోనా ఉన్నా లేకున్నా మరణించే అవకాశాలే అధికమని పేర్కొన్నారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రం పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా గాంధీలో మరణాలన్నీ కరోనాతోనే సంభవిస్తున్నాయంటూ అస త్య వార్తలు రాసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని డాక్టర్లు వాపోతున్నా రు. వేల మందికి పునర్జన్మ ప్రసాదిస్తున్న గాంధీ ప్రతిష్ఠను దిగజార్చేలా అబద్ధపు రాతలు రాస్తున్నదని విమర్శిస్తున్నారు. వివిధ రకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని, ముఖ్యంగా ప్రైవేటు దవాఖానలు పూర్తిగా చేతులెత్తేసిన వారిని కూడా గాంధీ వైద్యులు నిరాకరించకుం డా.. చేర్చుకొని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ వైద్యపరమైన సాంకేతిక విషయాలు తెలియకుండా ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నదని మండిపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో చోటుచేసుకొనే మరణాలకు కారణాలను నిర్ధారించేందుకు ఒక కమిటీ ఉంటుందని, కానీ ఆంధ్రజ్యోతి తనకు తానుగానే మరణాలన్నింటినీ కరోనా ఖాతాలో వేస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాజజ్‌ ఆఫ్‌ డెత్‌కు ప్రత్యేక కమిటీ
సాధారణంగా ఏ ప్రభుత్వ దవాఖానలోనైనా రోగి మరణించినప్పుడు అందు కు గల కారణాన్ని గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఉంటుంది. కారణాలను గుర్తించి వివరాలను రికార్డుచేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఏ సమస్య వల్ల అధికంగా మరణాలు జరుగుతున్నాయో విశ్లేషించి వాటి నివారణకు చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ అన్ని టీచింగ్‌ హాస్పిటల్స్‌లోనూ ఉంటుంది. ఈ కమిటీ నిర్ధారణ తరువాతనే అది కొవిడ్‌ మరణమా కాదా అన్నది తేలుస్తారు. ప్రైవేటు దవాఖానల్లో ఈ విశ్లేషణలు ఉండవు, కానీని ప్రభుత్వ దవాఖానల్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ నెల ఒకటో తేదీన గాంధీలో సంభవించిన 17 మరణాల్లో 12 మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల కారణంగా మృత్యువాత పడినట్టు కమిటీ నిర్ధారించిందని అధికారులు తెలిపారు.
సాధారణ రోజుల్లోనూ మరణాలు
కరోనా సమయంలోనే కాకుండా అంతకుముందు నుంచీ కూడా విషమ పరిస్థితికి చేరుకున్న రోగులు వివిధ ప్రాంతాల నుంచి, ప్రైవేటు కార్పొరేట్‌ దవఖానల నుంచి కూడా గాంధీకి వస్తుంటారు. కరోనా ఊసులేని 2019లో గాంధీలో 9800 మరణాలు సంభవించాయి. రోజుకు సగటున 27 మంది మరణించారు. వీరిలో విషమ పరిస్థితుల్లో వచ్చి మృత్యువాత పడినవారు 40- 50% ఉంటారు. గత ఏడాది నుంచి గాంధీని పూర్తిగా కొవిడ్‌ చికిత్సకు కేటాయించారు. ఆ సమయంలో దవాఖానలో చేరిన కొవిడ్‌ రోగులలో దీర్ఘకాలిక రోగాలున్నవారే ఎక్కువగా మరణించారు. ఈ మరణాలన్నింటినీ గాంధీ ఖాతాలోనే జోడించడం దుర్మార్గమని వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి మరణాన్ని కరోనాకు ఆపాదించలేమని నిపుణులు స్పష్టంచేస్తున్నా.. ఆంధ్రజ్యోతి మాత్రం కరోనా ఖాతాలో వేస్తున్నది.
12 మంది దీర్ఘకాలిక రోగులే
గాంధీలో సాధారణంగా ప్రతిరోజు 30 – 40 వరకు మరణాలు సంభవిస్తుంటాయి. ఇందులో 40-50 శాతం రోగులు ప్రైవేటు దవాఖానల నుంచి ఆఖరు క్షణాల్లో వచ్చినవారే ఉంటారు. అలాగని ఆ కేసులను వెనక్కి పంపలేం కదా. ప్రతి కేసును ట్రీట్‌ చేసి వారిని బతికించేందుకు గవర్నమెంట్‌ డాక్టర్స్‌ ప్రయత్నిస్తారు. చాలా కేసులు వెంటిలెటర్‌పై వస్తుంటాయి. కరోనా విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఈ నెల ఒకటిన మరణించిన 17 మందిలో 12 మంది దీర్ఘకాలిక రోగులే.

  • డాక్టర్‌ రాజారావు,
    సూపరింటెండెంట్‌, గాంధీ దవాఖాన

ఇవీ కూడా చదవండి

నెత్తురోడిన అడవి

కొన్నది వంకాయ.. కొసిరేది గుమ్మడికాయ

ఎవరి పంథానో ఫాలో కాను!

ఓ విజేత చరిత్ర

Advertisement
గాంధీపై ‘జ్యోతి’ అసత్యపు రాతలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement