Himanshu | రాజన్న సిరిసిల్ల, మే 26 ( నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు పర్యటనతో సిరిసిల్ల ప్రజలను ఆకట్టుకున్నారు. తన తాత కేసీఆర్, తన తండ్రి కేటీఆర్ ల నుంచి నేర్చుకున్న వినయం, విధేయత, క్రమశిక్షణ కళ్లకు కట్టినట్టు కనిపించింది.
హిమాన్షు రావు గతంలో కూడా పలుమార్లు సిరిసిల్లలో పర్యటించినప్పటికీ, ఈసారి పర్యటనలో మరింత మెచ్యూరిటీగా కనిపించారు. ఆత్మవిశ్వాసం, గంభీరం, హుందాతనం తో వ్యవహరించారు. పిన్న వయసులోనే దైవభక్తి అలవర్చుకోవడం, ఇతరులకు సహాయపడటం, ప్రోత్సహించడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి తగ్గ తనయుడే అంటూ సిరిసిల్లలో చర్చించుకుంటున్నారు.
సిరిసిల్ల చేనేత కళాకారులు అద్భుత నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేస్తారని, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిందని హిమాన్షురావు పేర్కోన్నారు. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తయారు చేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, కేటీఆర్ చిత్ర పటంతో కూడా శాలువా, భారత దేశ చిత్రపటాన్ని, మగ్గంపై నేసిన వాటిని ప్రదర్శించారు. ఇక్కడి వస్త్రాలను చూసి ప్రపంచం నివ్వెరపోయేలా చేతులతోనే తయారు చేస్తారని స్నేహితులకు వివరించారు. తెలంగాణలో పోచంపల్లి, గద్వాల్, తరువాత సిరిసిల్లలో చీరల తయారీ అద్భుతంగా ఉందని, మొదటి ప్రాధాన్యత సిరిసిల్లకే వచ్చి సందర్శించామని స్నేహితులకు వివరించారు. హరిప్రసాద్ తయారు చేసిన చీరలను పరిశీలించిన హిమాన్షు తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలు ఉట్టిపడేలా చీరలు ఉన్నాయని అభినందించారు. తరువాత మూడు చీరలను కొనుగోలు చేశారు.

Himanshu2
కేటీఆర్ టీ స్టాల్ను సందర్శించిన హిమాన్షు, కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. శ్రీనివాస్ కొడుకులతో ఉత్సాహాంగా మాట్లాడి వారి అభిరుచులను తెలుసుకున్నారు. టీస్టాల్లో ఏర్పాటు చేసిన కేసీఆర్, కేటీఆర్ ఫోటో ఉన్న చోటనే కూర్చొని టీ తాగారు. నాయకులు, స్నేహితులతో తాత ఫోటో పక్కన కూర్చోని టీ తాగుతున్నాననిసంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హిమాన్షుతో స్థానిక యువకులు, బీఆర్ఎస్ నేతలు, చిన్నారులు సెల్ఫీలు దిగడానికి ఆసక్తి కనబరిచారు. వారు కోరగానే వారితో ఫోటోలు, సెల్ఫీలు దిగి వారిని సంతోష పరిచారు.

Himanshu4
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం పర్యటించిన హిమాన్షురావు తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ బాటలోనే క్రమశిక్షణతో, వినయంగా, విధేయతతో నడుచుకున్నారు. అందరినీ అప్యాయంగా ప్రేమతో పలకరించి, జనంలో కలిసిపోతూ ముందుకు సాగారు. ఎదురువచ్చిన చిన్నారులను, యువకులను పలకరిస్తూ వారితో మాటలు కలిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సిరిసిల్లలో చేనేత కళాకారుడు హరి ప్రసాద్ కార్ఖానాకు వెళ్లడంతో పాటు కేటీఆర్ టీ స్టాల్, గంభీరావుపేట కేజీ టు పీజ క్యాంపస్ లోని సందర్శించిన హిమాన్షు అచ్చం కేటీఆర్ లాగే నడవడిక, మాటతీరు, అప్యాయతల పలకరింపు, విధేయతతో కూడిన మాటలు స్థానికులను అకట్టుకున్నాయి. కేటీఆర్ సార్ లెక్కనే హిమాన్షు ఉన్నారని అదే తీరుగా వ్యవహరిస్తున్నారని చర్చించుకుంటున్నారు.