CNG Price | మళ్లీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సీఎన్జీ ధరలు పెంపు
CNG Price | కేంద్రం మళ్లీ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ. పెంచింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమలులోకి వచ్చాయి.
CNG Price | కేంద్రం మళ్లీ షాకిచ్చింది. సీఎన్జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూ.2 పెంచింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమలులోకి వచ్చాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర రూ.81.09 నుంచి రూ.83.09కి చేరింది. సీఎన్జీ ధరలను పెంచడం మే 15వ తేదీ నుంచి ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మే 15వ తేదీన మొదట కిలోకు రూ.2 పెంచగా.. అనంతరం రెండుసార్లు ఒక్క రూపాయి చొప్పున కేంద్రం పెంచింది. తాజాగా మరో రూ.2 పెరగడంతో నాలుగోసారి సీఎన్జీ ధరలు పెరిగినట్లయ్యింది. గత 11 రోజుల్లో మొత్తం రూ.7 వరకు ధరలు పెరగడంతో వాహనదారులు, ఆటో, క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగాలపై అదనపు భారం పడనుంది.
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. సోమవారం నాడు పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.61, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.71 చొప్పున ధరలు పెరిగాయి. తాజా పెంపుతో మే 15 నుంచి లీటర్‌కు మొత్తం పెంపు రూ.7.5కు చేరింది. గడచిన 11 రోజుల్లో ఇంధన ధరలు పెరుగడం ఇది నాలుగోసారి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12 చేరుకోగా లీటర్ డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

