న్యూఢిల్లీ, ఆగస్టు 2 : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలకు మళ్లీ రెక్కలురాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఏఐ సర్వర్ల డిమాండ్‌లో పెరుగుదల కారణంగా, కీలకమైన హార్డ్‌వేర్ ప్లాట్‌ఫామ్ అయిన ప్రింటెడ్ సర్క్యూటర్ బోర్డుల కొరత ఏర్పడింది. దీంతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో భాగాలను అమర్చే హార్డ్‌వేర్ ప్లాట్‌ఫారమ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల కొరతకు పెరుగుతున్న ముడి పదార్థాల ధరలు, కీలక రవాణా మార్గాల్లో సరఫరా అంతరాయాలు, ఏఐ టెక్నాలజీ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని పేర్కొన్నాయి.