Collector Priyanka | మాగనూరు, సెప్టెంబర్ 30 : రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతోపాటు భూముల హక్కులు, సరిహద్దులకు స్పష్టత కల్పించడమే భూభారతి రీ సర్వే ప్రధాన లక్ష్యమని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అన్నారు. మాగనూరు మండలం గజురం దొడ్డి గ్రామంలో నిర్వహించిన భూభారతి భూ సర్వే గ్రామసభలో కలెక్టర్ పాల్గొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వే ద్వారా ప్రతి భూమికి భూదార్ నంబర్ కేటాయించడంతోపాటు ఎల్బీఎం ద్వారా భూముల హక్కులు, సరిహద్దులకు స్పష్టత ఏర్పడుతుందని తెలిపారు.
భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం లేకుండా భూ రికార్డులను పకడ్బందీగా రూపొందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సర్వే ప్రక్రియలో రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి, తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు.
సర్వేయర్ అందుబాటులో ఉండాల్సిందే. మాగనూరు మండలంలో సర్వేయర్ అందుబాటులో ఉండడం లేదని తహసీల్దార్ రహిమాన్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ భూ సర్వే సమయంలో సర్వేయర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ సర్వేకు సంబంధించి రైతుల నుంచి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తనిఖీ అనంతరం జిల్లా కలెక్టర్ గజురం దొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పిల్లలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మౌలిక వసతుల కోసం గ్రామస్తుల వినతి..
గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుతోపాటు సీసీ రోడ్లు, బీటీ రోడ్డు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని మౌలిక వసతుల సమస్యలను కలెక్టర్కు వివరించారు. గ్రామస్తుల వినతిపై స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి సంబంధించి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంతో భూభారతి రీ సర్వే ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు గ్రామంలోని మౌలిక వసతుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించింది.
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్తో రచ్చ!