Rohit Sharma: భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో ఘనత సాధించాడు. గువాహటి వన్డేల్లో అర్ధశతకంతో మెరిసిన హిట్‌మ్యాన్ వన్డేల్లో 12వేల పరుగుల క్లబ్లో చేరాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధిచిన మూడో ఇండియన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఈ డాషింగ్ ఓపెనర్ 282 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) 242తో అతడి కంటే ముందున్నాడు.
వచ్చే ఏడాది వరల్డ్‌కప్ ఆడడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ శర్మ వన్డేల్లో కీలక మైలురాయిని అందుకున్నాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ గువాహటి వన్డేలో అర్ధ శతకంతో కదం తొక్కిన రోహిత్ 12వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లను ఉతికేసి.. 73 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్‌మ్యాన్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.
Rohit Sharma scales mount 12k 🗻
Only the third Indian to do so, after Sachin Tendulkar and Virat Kohli pic.twitter.com/dyiR7EkgPC
— Cricinfo (@cricinfo) September 30, 2026
తద్వారా వన్డేల్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ అనంతరం అత్యధిక పరుగులు చేసిన మూడో భారతీయుడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. తిరువనంతపురంలో కోహ్లీ 15వేల పరుగుల వీరుడిగా అవతరించగా.. ఇప్పుడు రోహిత్ 12వేల రన్స్‌తో అభిమానులను అలరించాడు.
ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. రోహిత్ 282 తీసుకోగా.. కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో పన్నెండు వేల రన్స్ కొట్టేందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు 300 ఇన్నింగ్స్‌లు, రికీ పాటింగ్(ఆస్ట్రేలియా)కు 314, కుమార సంగక్కర(శ్రీలంక)కు 336 ఇన్నింగ్స్‌లు పట్టింది.