ఢిల్లీ : కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్స్‌లో భారత ప్యాడ్లర్లు సత్తాచాటారు. పురుషులతో పాటు మహిళల విభాగాల్లోనూ ఆలిండియా ఫైనల్‌గా సాగిన పోరులో అంకుర్ భట్టాచార్జీ, యశస్విని ఘోర్పడే సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో అంకుర్.. 4-3తో పయాస్ జైన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.
మహిళల ఫైనల్స్‌లో యశస్విని.. 4-1తో తెలుగమ్మాయి ఆకుల శ్రీజపై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ మినహా అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలు సాధించడం గమనార్హం.