హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): స్కూళ్లకు దసరా సెలవులు ఖరారయ్యాయి. ఈ నెల 10 నుంచి 22 వరకు 13 రోజులపాటు సెలవులిచ్చారు. 23న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. ప్రస్తుతం బడుల్లో సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. అయితే ఈనెల 9న 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు చేశారు.
ఆ రోజు నిర్వహించే ఇంగ్లిష్ పరీక్షను ఉదయం 9: 15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు నిర్వహించాలని సూచించారు. జూనియర్ కాలేజీలకు ఈనెల 10 నుంచే దసరా సెలవులిచ్చారు. వీటికి 21 వరకే సెలవులిచ్చారు. అంటే 12 రోజులే సెలవులిచ్చారన్నమాట. సెలవుల అనంతరం 22న పునఃప్రారంభమవుతాయి.