e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home Top Slides నెత్తురోడిన అడవి

నెత్తురోడిన అడవి

నెత్తురోడిన అడవి

నక్సలైట్ల దాడిలో ఐదుగురు జవాన్లు మృతి
12మందికి గాయాలు
మహిళా నక్సల్‌ మృతి
ఛత్తీస్‌గఢ్‌లోఎన్‌కౌంటర్

కొత్తగూడెం క్రైం, ఏప్రిల్‌ 3: దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. తమ కోసం గాలిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు మెరుపుదాడి జరిపి కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురు దాడికి దిగారు. రెండు వర్గాల మధ్య సుమారు రెండు గంటల పాటు భీకర పోరు జరిగింది. భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ మావోయిస్టులు దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. జవాన్ల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్తీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, సీఆర్‌పీఎఎఫ్‌, కోబ్రా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్‌లో సుమారు 2 వేల మంది జవాన్లు పాల్గొన్నారు. బృందాలుగా విడిపోయి మావోయిస్టుల కోసం వెతుకుతున్నారు. శనివారం మధ్యాహ్నం సిల్గేరీ అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌లో ఉన్న జవాన్లపై మావోయిస్టుల గెరిల్లాసైన్యానికి (పీఎల్‌జీఏ) చెందిన నక్సలైట్లు మెరుపుదాడికి దిగి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీఆర్‌జీకి చెందిన నలుగురు జవాన్లు, కోబ్రా బెటాలియన్‌కి చెందిన ఒక జవాన్‌ చనిపోయినట్టు అవస్తీ వెల్లడించారు. మహిళా మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నామని చెప్పారు. కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో గాలిస్తున్నారు. బీజాపూర్‌ జిల్లా చెర్పాల్‌ సమీపంలోని మోడిపారా ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు వెలికితీసి, నిర్వీర్యం చేశాయి.

ఇవి కూడా చదవండి :

దీదీ.. మీరు వారణాసిలో పోటీ పడొచ్చు!

రేపటి నుంచి 71 అన్‌రిజర్వ్‌డ్‌ రైలు సర్వీసులు

ఉద్యోగం నుంచి ప్రొఫెసర్‌ సాయిబాబా తొలిగింపు

సుప్రీంకోర్టుకు ‘ఇస్రో కుట్ర కేసు’ నివేదిక

‘ఇడ్లీ’ అమ్మకు సొంత ఇల్లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నెత్తురోడిన అడవి

ట్రెండింగ్‌

Advertisement