Mandula samuel | తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాళ్ల మీ పెత్తనమేంటి.. ?.. పవన్ కల్యాణ్‌పై మందుల సామెల్ ఫైర్
Mandula samuel | తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. మా సిలిండర్‌కు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తున్నరు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేం వండుకోని తింటున్నం.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తెలంగాణను ఎవడైనా కానీపోని మాటలంటే కత్తులకోలాటమాడతమన్నారు.
Mandula samuel | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరితోటలు ఎండిపోయినయ్ అన్నవ్.. తెలంగాణ ప్రజానీకం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. మీకు రాజధాని లేదు.. రాజధాని కోసం నానా తంటాలు పడుతున్నారు.. మీరు అక్క్డడ బాగు చేసుకోండి. అన్నదమ్ముల్లా కలిసుందాం కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరడుగు పెడితే పొయ్య కాలుతుందనే సంగతి మరిచిపోవద్దని చెప్తున్నా. మా సిలిండర్‌కు నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తున్నరు. కానీ ఆ సిలిండర్ ద్వారా మేం వండుకోని తింటున్నం.. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తెలంగాణను ఎవడైనా కానీపోని మాటలంటే కత్తులకోలాటమాడతమన్నారు.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాళ్ల మీ పెత్తనమేంటి.. ? అని మందుల సామెల్ ప్రశ్నించారు. మీరు హైదరాబాద్‌లో బతుకొచ్చు. హైదరాబాద్‌లో నీళ్లు మావి. గాలి మాది.. రోడ్డు మావి. తినే తిండి కూడా మాదే. మీరు బతుకొద్దంటలేను.. తిరుగొద్దంటలేను. కానీ మా ఆత్మ గౌరవం మీద మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానీకం క్షమించదు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత 11 రోజులు తాను పస్తులు ఉన్నానని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ మాటలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయి. తెలంగాణ రావడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చు, అన్నదమ్ముల్లా కలిసే ఉందాం, తెలంగాణ వ్యవస్థ పైనా, మా ఆత్మగౌరవంపైనా దెబ్బతిస్తే ఊరుకునేది లేదని మందుల సామెల్ హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ సినిమాలకు తెలంగాణాలో అభిమానులు ఉన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తే వాళ్లే మీ శత్రువులవుతారని హెచ్చరించారు. 60 ఏళ్లుగా ఆంధ్రా వలస పాలకుల చేతిలో మేము గోసపడ్డాంజఇంకా మీరు పెత్తనం చెలాయించాలని చూస్తే మేం చేతగాని వాళ్లమా..? అన్నారు మందుల సామెల్.
ఖబర్దార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తాం
తెలంగాణలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కత్తులతో కోలాటమాడుతాం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మరోసారి ధ్వజమెత్తిన తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్
కొట్లాడి, పోరాడి… https://t.co/zpoHj6yBUh pic.twitter.com/DRMF2htNKb
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
Read Also :
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

