BRS Switzerland | తెలంగాణ ఆడపడుచులకు, అన్నదమ్ములకు, తోటి గులాబీ సైనికులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ నాయకుడు శ్రీధర్ గందె రాష్ట్ర అవతరణ దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదు… ఇది ఆరు దశాబ్దాల ఆరాటాన్ని, పోరాటాన్ని, చావు నోట్లో తలపెట్టి సాధించిన మన స్వరాష్ట్ర స్వప్నాన్ని గుర్తుచేసే రోజు అని గుర్తు చేశారు. నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రాణాలను పణంగా పెట్టి, కాళ్లు అరిగిపోయేలా తిరిగిన ఉద్యమ గడ్డ ఇది.
నాడు “మా నీళ్లు మాకు, మా నిధులు మాకు, మా నియామకాలు మాకు” అని గల్లా ఎగరేసి, ఢిల్లీ పీఠాల మెడలు వంచి సాధించుకున్న ఆత్మగౌరవ ప్రతీక మన తెలంగాణ. రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. శూన్యం నుండి నవ నిర్మాణాన్ని ఎలా చేయాలో దేశానికి చూపించిన ఘనత మన కేసీఆర్‌ది. ఎండిపోయిన పగుళ్ల భూముల్లో కాళేశ్వరం జలాలతో పచ్చని పంటలు పండించి, దేశానికి అన్నపూర్ణగా మార్చారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలతో మన ఊళ్లను, మన ఇంటి ఆడబిడ్డల నీటి కష్టాలను తీర్చారు. మరోవైపు మన గ్లోబల్ లీడర్ కేటీఆర్ (KTR)నాయకత్వంలో ఐటీ, ఇండస్ట్రీస్ రంగాల్లో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టారు.
గల్లీ నుండి గ్లోబల్ దాకా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను స్కై-హై లెవెల్‌కి తీసుకెళ్లారు.రాజకీయంగా తాత్కాలికంగా ఏ మార్పులు వచ్చినా… తెలంగాణ ప్రజల గుండెల్లో, ఈ నేల ప్రతి అంగుళంలో కేసీఆర్ గీసిన ముద్ర శాశ్వతం. తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోవడాన్ని ఒప్పుకోదు, హక్కుల కోసం రాజీపడదు. మన ప్రగతిని అడ్డుకోవాలని చూసే శక్తులకు, ఢిల్లీ గులాములకు గట్టిగా బుద్ధి చెప్పే చైతన్యం మన సొంతం.
ఈ శుభ దినాన నాడు అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, మన కేసీఆర్, కేటీఆర్ మార్గదర్శకత్వంలో బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్లీ అలుపెరగని పోరాటం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ప్రగతి పథంలో మన నాయకుల వెంటే నడుద్దామన్నారు.