Mahesh Bigala | అన్ని ఖండాల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం : బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల
Mahesh Bigala | ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో తెలంగాణ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఉద్యమ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ముందుకు రావడం గర్వకారణమని అన్నారు.
Mahesh Bigala | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా (North America), యూరప్ (Europe), ఆసియా (Asia), ఆఫ్రికా (Africa), దక్షిణ అమెరికా (South America), ఓషియానియా (Oceania) వంటి అన్ని ఖండాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అమెరికా నుంచి కెనడా వరకు, లండన్ నుంచి న్యూజిలాండ్ వరకు అలాగే ఆఫ్రికాలోని దక్షిణాఫ్రికా నుంచి టాంజానియా వరకు, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గల్ఫ్ దేశాలు బహ్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో తెలంగాణ సంబరాలు వైభవంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఉద్యమ చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ముందుకు రావడం గర్వకారణమని ఆయన అన్నారు.
అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మలేషియాలో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొననున్నారన్నారు. మలేషియాలో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు నిరంతరం పర్యవేక్షణలో కొనసాగుతున్నాయని, మలేషియాలోని తెలుగు సంఘాలు ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ.. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించేందుకు ప్రతి ప్రవాస తెలంగాణవాసి భాగస్వామ్యం కావాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.
Read Also :
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

