Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Jabardasth Babu | బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ బాబు ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు జబర్దస్త్‌లో రచయితగా అడుగుపెట్టి, ఆ తర్వాత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Jabardasth Babu | బుల్లితెరపై తనదైన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైన జబర్దస్త్ బాబు ఇప్పుడు దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు జబర్దస్త్‌లో రచయితగా అడుగుపెట్టి, ఆ తర్వాత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమకథ, కాబోయే భార్య అమూల్య గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జబర్దస్త్ బాబు తన కాబోయే భార్య పేరు అమూల్య అని వెల్లడించారు. ఆమె ఓ స్థానిక టీవీ ఛానల్లో యాంకర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు టిక్‌టాక్‌లో ఆమె వీడియోలు చూసి ఇష్టపడ్డానని చెప్పారు. అప్పటికే అమూల్యకు సుమారు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆమె వీడియోలకు లైకులు కొడుతూ, కామెంట్లు పెట్టేవాడినని, మెసేజ్‌లు పంపించినా మొదట్లో ఆమె స్పందించలేదని తెలిపారు. ఒకసారి హైదరాబాద్‌లో అమూల్య అనుకోకుండా కనిపించినా, అప్పుడు ఆమెతో మాట్లాడలేకపోయానని బాబు చెప్పారు. ఆ తర్వాత జబర్దస్త్‌లో తనకు కొంత గుర్తింపు వచ్చినప్పుడు ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని కాల్ చేసినట్లు వెల్లడించారు. అయితే తన మాటలు, ప్రవర్తన నచ్చకపోవడంతో అమూల్య తనను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని, అంతేకాకుండా హెచ్చరించిందని ఆయన తెలిపారు.
లాక్డౌన్ తర్వాత మరోసారి అమూల్యకు ఫోన్ చేసినప్పుడు ఆమె సోదరుడు కాల్ ఎత్తాడని బాబు వెల్లడించారు. ఆ తర్వాత అమూల్యతో మాట్లాడే అవకాశం వచ్చిందని చెప్పారు. అప్పటికి ఆమె హైదరాబాద్‌లో ఉండటంతో ఇద్దరూ మాట్లాడుకోవడం, కలుసుకోవడం ప్రారంభించారని తెలిపారు. తొలుత సాధారణ పరిచయంగా మొదలైన తమ బంధం.. ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారిందని బాబు వివరించారు. మొదట్లో తనను పట్టించుకోని అమ్మాయితోనే చివరకు ప్రేమలో పడటం, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడం తన జీవితంలో ప్రత్యేకమైన అనుభవమని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. తన కాబోయే భార్య అమూల్య గురించి బాబు ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆమె చాలా మంచి అమ్మాయి అని, తన కోసం చాలాకాలం ఎదురుచూసిందని చెప్పారు. తమ ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి అంగీకారం లభించిందని వెల్లడించారు. తన దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా అమూల్య ఆర్థికంగా సహాయం చేసేదని తెలిపారు. తన ప్రేమకథలో అమూల్య తనకు ఇచ్చిన ఓ ప్రత్యేకమైన బహుమతి గురించి కూడా బాబు వెల్లడించారు. మంచి రీల్స్ చేసుకోవడానికి, ఫొటోలు తీసుకోవడానికి ఐఫోన్ అవసరమని భావించిన ఆమె.. తన ఐదు నెలల జీతాన్ని ఖర్చు చేసి ఫోన్ కొనిచ్చిందని తెలిపారు.
తాను వద్దని చెప్పినా, తన కెరీర్‌కు ఉపయోగపడుతుందని భావించి అమూల్య ఐఫోన్ కొనిచ్చిందని గుర్తుచేసుకున్నారు. జబర్దస్త్‌లో కొనసాగుతూ మరింతగా ఎదగాలనే తన ప్రయత్నాలకు ఆమె ఎంతో ప్రోత్సాహం అందించిందని చెప్పారు. అలాంటి అమ్మాయి జీవితంలోకి రావాలంటే అదృష్టం ఉండాలని బాబు భావోద్వేగంగా పేర్కొన్నారు. ఒక్క సినిమా అయినా చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇన్నాళ్లూ అనుకున్నానని జబర్దస్త్ బాబు తెలిపారు. ఇప్పుడు అమూల్యను వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను ఆయన స్పష్టంగా వెల్లడించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Amulya
- Gift
- jabardasth babu
- love
RELATED ARTICLES
తాజా వార్తలు
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

