CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
CJP Protest: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీప్కే తన ట్వీట్లో మోదీ ఓడినట్లు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన(CJP Protest) ప్రదర్శన చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వేర్వేరు ప్రాంతాల నుంచి ఢిల్లీ వస్తున్న సుమారు 500 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మరో 50 మందిని కూడా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని 20 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌లోనూ ఓ డిటెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ స్టేడియాల్లో ఆ డిటెన్షన్ కేంద్రాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సీజేపీ నిరసన కోసం సుమారు 20 వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జూలై 20న జరిగిన సీజేపీ నిరసన హింసకు దారి తీసిన నేపథ్యంలో ఇవాళ జరిగే కార్యక్రమం కోసం పోలీసు పహారా పెంచారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీలోని 45 మెట్రో స్టేషన్లను ఇవాళ మూసివేశారు.
నిరసనకారులను డ్రోన్ల ద్వారా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు సీజేపీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇవాళ ఉదయం ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ పరాజయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. నిరసనకారుల్ని అడ్డుకోవడం, ఢిల్లీని మూసివేయడం అంటే.. ఇది ప్రభుత్వ శక్తికి సంకేతం కాదు అని, కానీ తన స్వంత ప్రజల పట్ల ఆయన భయపడిపోయారని దీప్కే అన్నారు.
Modi has accepted defeat even before our protest has begun.
The mass crackdown on protesters and the shutdown of Delhi are not signs of strength, but of a leader terrified of his own people.
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

