Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Viral News | చైనాలో ఓ రెస్టారెంట్ యజమాని తన ఉద్యోగుల ప్రయాణ కష్టాలను చూసి చలించిపోయారు. దీంతో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి ఒక్కోటి సుమారు రూ.43 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చారు.
Viral News | తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు చలిలో వణుకుతూ ఎలక్ట్రిక్ స్కూటర్లపై విధులకు రావడం చూసి ఆ యజమాని మనసు చలించింది. తాను కారులో హాయిగా ప్రయాణిస్తుంటే.. తన కోసం కష్టపడే ఉద్యోగులు మాత్రం వాతావరణ ప్రతికూలతలను ఎదుర్కోవడం ఎందుకని ఆలోచించారు. అంతే.. వారి కష్టాన్ని తగ్గించేందుకు ఏకంగా బీఎండబ్ల్యూ కార్లనే కానుకగా ఇచ్చారు. ఒక్కో కారు విలువ సుమారు రూ.43 లక్షలు ఉండటం గమనార్హం. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మీటింగ్ ఉందని తీసుకెళ్లి.. కార్లు గిఫ్ట్‌గా!
హెనాన్ ప్రావిన్స్‌లోని జియాజువో నగరంలో మా యాన్లీ అనే మహిళ బీఫ్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్‌ను నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కొందరు ఉద్యోగులకు బహుమతిగా కార్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 24న వారిని బీఎండబ్ల్యూ షోరూమ్‌కు తీసుకెళ్లారు. మీటింగ్ ఉందని చెప్పడంతో ఉద్యోగులు సాధారణంగానే వెళ్లారు. తీరా అక్కడికి చేరుకున్నాక తమకు కొత్త కార్లు కానుకగా ఇవ్వబోతున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఒక్కో కారు విలువ సుమారు 3 లక్షల యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.43 లక్షలు). ఈ కార్లను మా యాన్లీ రెండు వారాల ముందే పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.
చలిలో వచ్చిన ఉద్యోగిని చూసి..
ఇలా బెస్ట్ ఎంప్లాయీస్‌కు బీఎండబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చిన ఈ ఆలోచన వెనుక ఓ సంఘటన ఉందని మా యాన్లీ తెలిపారు. గత శీతాకాలంలో ఓ ఉద్యోగిని ఉదయాన్నే చలిలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రెస్టారెంట్‌కు వచ్చింది. చలికి ఆమె ముఖం ఎర్రగా మారడం చూసి మా యాన్లీ చలించిపోయారు. తాను కారులో వెచ్చగా, సౌకర్యంగా ప్రయాణిస్తుంటే.. తన కోసం పనిచేసే ఉద్యోగులు మాత్రం చలిగాలులకు ఇబ్బంది పడటం ఆమెను ఆలోచింపజేసింది. ‘నేను కారులో సౌకర్యంగా ప్రయాణించగలుగుతున్నప్పుడు.. నా ఉద్యోగులు ఎందుకు అలా కష్టపడాలి?’ అని తనలో తాను ప్రశ్నించుకున్నట్లు ఆమె వివరించారు.
తన వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఉద్యోగుల సమష్టి కృషే ప్రధాన కారణమని మా యాన్లీ పేర్కొన్నారు. తాను సాధించిన విజయాల ఫలాలు ఉద్యోగులకూ అందాలని, వారి జీవితాల్లోనూ సౌకర్యాలు పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా, కారు అందుకున్న లీ జీ అనే ఉద్యోగిని ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు ఇంత పెద్ద బహుమతి వస్తుందని కలలోనూ అనుకోలేదు. షోరూమ్‌కు వెళ్తున్నప్పుడు బాస్ ఓ పెద్ద బొమ్మను గిఫ్ట్‌గా ఇస్తానని మాత్రమే చెప్పారు’ అని ఆమె చెప్పినట్లు వార్తా కథనం పేర్కొంది.
మా యాన్లీ తన సిబ్బందికి బహుమతులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. చైనాలో సంప్రదాయ పండుగల సందర్భంగా ఉద్యోగులకు నిత్యావసర వస్తువులు, నగదు బోనస్‌లు అందిస్తుంటారు. ఈసారి మాత్రం ఏకంగా ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడంతో ఆమె నిర్ణయం ప్రత్యేకంగా నిలిచింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
మురాసు తుఫాన్ ప్రభావం.. పెన్‌పహాడ్ వ్యాప్తంగా నేలవాలిన వరి చేలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

