పాట్నా: ఒక ఎమ్మెల్యే తనదైన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. బెడ్‌పై పడుకున్న ఆయన ఒక పూజారితో నుదుట బొట్టుపెట్టించుకున్నారు. అయితే వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గ్రహించిన ఆయన వెంటనే మంచం నుంచి కిందకు దిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bihar MLA Anant Singh) బీహార్‌లోని మొకామాకు చెందిన జేడీయూ ఎమ్మెల్యే అనంత సింగ్ తన రాజకీయ కార్యకలాపాలు, ప్రకటనలు, చట్టపరమైన కేసుల కారణంగా గత కొన్నేళ్లుగా తరచుగా వార్తల్లో నిలిచారు. ‘ఛోటే సర్కార్’గా ప్రసిద్ధి చెందిన ఆయన తాజాగా తనదైన స్టైల్‌ను చాటుకున్నారు.
కాగా, ఎమ్మెల్యే అనంత సింగ్ బెడ్‌పై హాయిగా పడుకుని ఉండగా, ఒక పూజారి ఆయన నుదుటిపై తిలకం దిద్దారు. దీనిని వీడియో తీస్తున్నట్లు గమనించగానే ఆ ఎమ్మెల్యే వెంటనే మంచం నుంచి దిగి నిల్చున్నారు. దీంతో పూజారి ఆయనకు పూలమాల వేశారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయనకు శాలువాలు కప్పారు.
మరోవైపు ఒక వ్యక్తి నల్ల కళ్ల జోడు ఇవ్వడంతో ఎమ్మెల్యే అనంత సింగ్ దానిని ధరించారు. తనదైన శైలిలో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తీరుపై విమర్శలు, కామెంట్లు వెల్లువెత్తాయి.
Anant Singh Viral Video : बिस्तर पर लेटकर बाबा से टीका लगवा रहे अनंत सिंह, हो गए Viral
#AnantSingh #ViralVideo #BiharNews #News18BiharJharkhand https://t.co/VYZUEm8te9
— News18 Bihar (@News18Bihar) October 7, 2026