Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Darshan | కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దర్శన్‌కు అనుకూలంగా పరిణామాలు చోటుచేసుకోవడం లేదనే చర్చ సాగుతోంది. తాజాగా కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదోష్ రావుకు సంబంధించిన అంశంపై దర్శన్ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు సమాచారం
Darshan | కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దర్శన్‌కు అనుకూలంగా పరిణామాలు చోటుచేసుకోవడం లేదనే చర్చ సాగుతోంది. తాజాగా కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదోష్ రావుకు సంబంధించిన అంశంపై దర్శన్ భార్య విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె చేసిన ప్రయత్నానికి చుక్కెదురైంది.
రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్‌తో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు. కేసు దర్యాప్తు, న్యాయ విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన ప్రదోష్ రావు అప్రూవర్‌గా మారడం కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. కేసులోని ఇతర నిందితులకు సంబంధించిన వివరాలు, ఘటనకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంలో అప్రూవర్ వాంగ్మూలం ప్రాధాన్యం సంతరించుకుంటుంది.అయితే ప్రదోష్ రావును అప్రూవర్‌గా మార్చిన ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగలేదని విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఆమె తొలుత హైకోర్టును ఆశ్రయించారు.
ప్రదోష్ రావును అప్రూవర్‌గా అంగీకరించే సమయంలో క్రిమినల్ ప్రొసీజర్‌కు సంబంధించిన నిబంధనలు సరిగ్గా పాటించలేదని విజయలక్ష్మి తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 164వ సెక్షన్‌కు సంబంధించిన నిబంధనలను పాటించలేదని, ఇతర నిందితులకు తగిన సమాచారం ఇవ్వకుండానే ఈ ప్రక్రియ చేపట్టారని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ విజయలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయంపై విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం హైకోర్టు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన లోపాలు కనిపించడం లేదని ధర్మాసనం భావించింది. దీంతో పిటిషన్‌ను తిరస్కరించింది.ఈ పరిణామంతో ప్రదోష్ రావు అప్రూవర్‌గా మారడాన్ని సవాలు చేస్తూ విజయలక్ష్మి చేసిన న్యాయపరమైన ప్రయత్నానికి మరోసారి నిరాశ ఎదురైంది. ఈ నిర్ణయం రేణుకాస్వామి హత్య కేసు విచారణలో ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
Balakrishna | బాలకృష్ణ శివ నిర్వాణ దర్శకత్వంలో?
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

