Cocktail 2 Trailer | బాలీవుడ్ క్రేజీ లవ్ ట్రయాంగిల్.. ఆకట్టుకుంటున్న రష్మిక, షాహిద్ కపూర్ ‘కాక్టెయిల్ 2’ ట్రైలర్!
Rashmika Mandanna | బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్లు కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం కాక్టెయిల్ 2.
Cocktail 2 Trailer | బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్లు కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం కాక్టెయిల్ 2. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటీ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ ‘కాక్టెయిల్’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. హోమి అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఇటలీలోని అందమైన లోకేషన్ల నేపథ్యంలో స్నేహం, ప్రేమతో కూడిన ఒక కాంప్లికేటెడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే రష్మిక – షాహిద్ ప్రేమికుల కనిపిస్తుండగా కృతి సనన్ స్నేహితురాలిగా కనిపించబోతుంది. అయితే స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ఎలాంటి కాంప్లికేటెడ్ లవ్ ట్రయాంగిల్‌గా మారుతుంది అనేది సినిమా కథ. ఈ ట్రైలర్లో ఫస్ట్ పార్ట్‌లోని సూపర్ హిట్ సాంగ్ తుమ్ హీ హో బంధు రీమిక్స్ వెర్షన్ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దినేష్ విజన్, లవ్ రంజన్, ప్రమిత ఆర్ విజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

