Adhar card | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి | హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయ్యాక అమ్మాయి ఇంటి పేరు మారడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కోసారి అమ్మాయి పేరు కూడా మారుతుంది.

Adhar card | ఆధార్ ఇప్పుడు తప్పనిసరి. ప్రతిదానికి ఆధార్ అవసరమే. అందుకే ఆధార్ కార్డులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పులు వచ్చినా వాటిని సరిదిద్దుకునేందుకు యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది. అలాగే పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటిపేరు మార్చుకునేందుకు కూడా ఆధార్ అవకాశం అవకాశం కల్పించింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయ్యాక అమ్మాయి ఇంటి పేరు మారడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కోసారి అమ్మాయి పేరు కూడా మారుతుంది. ఈ సంగతిని దృష్టిలో ఉంచుకుని పెళ్లి తర్వాత అమ్మాయి పేరును ఎలాంటి రుసుము లేకుండా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ఆధార్ కార్డులో పేరు మార్చుకోవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఆన్లైన్లో పేరు మార్చడమెలా..
- ముందుగా ఆధార్ అధికారిక వెబ్సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి.
- హోం పేజిలోని My aadhaar సెక్షన్లో Update your aadharపై క్లిక్ చేయాలి
- ఆ తర్వాత Update Demographics Data Online పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTPపై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- అందులో నేమ్ చేంజ్ ఆప్షన్ ఎంచుకుని మారిన పేరు, ఇంటి పేరు వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ నంబర్‌ను ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
- ఈ మొత్తం ప్రాసెస్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
- ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి చేయగానే ఒక సర్వీస్ రిక్వెస్ట్ నంబర్(SRN) వస్తుంది. ఈ SRN నంబర్ ద్వారా అడ్రస్ అప్డేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో పేరు మార్చడమెలా..
- ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డులో పేరు మార్చడానికి ముందుగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
- ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు నేరుగా వెళ్లొచ్చు.. లేదా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి వెళ్లొచ్చు.
- ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయి.. మన ఆధార్ నంబర్ ద్వారా మనకు అందుబాటులో ఉన్న ఎన్రోల్మెంట్ సెంటర్లో.. మనకు వీలైన టైంకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
- ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లేప్పుడు తప్పనిసరిగా కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్స్‌ను తీసుకెళ్లాలి.
- ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ సిబ్బంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుని తిరిగి ఇచ్చేస్తారు.
- ఆధార్‌లో కొత్త పేరు, ఇంటి పేరు ఎలా ఉండాలో సిబ్బందికి చెప్పి మార్పించుకోవాలి.
- అవసరమైతే బయోమెట్రిక్ డేటాను కూడా అప్డేట్ చేస్తారు.
- ఈ ప్రాసెస్‌కు రూ.25 చెల్లించాల్సి ఉంటుంది.
ఏ డాక్యుమెంట్లు అవసరం?
సాధారణంగా పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చడానికి మ్యారేజి సర్టిఫికెట్‌ను ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డు, పాస్ పోర్టు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు(ఫొటోతో ఉన్నవి), విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా ప్రూఫ్‌గా సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే వీటిల్లో పెళ్లి తర్వాత మారిన పేరు, ఇంటిపేరు ఉండాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు పొందడమెలా
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

