Boy Assaulted By Classmates | బాలుడ్ని వేధించిన క్లాస్మేట్స్.. మలద్వారంలో కర్ర చొప్పించడంతో దెబ్బతిన్న పేగులు
Boy Assaulted By Classmates | ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: ఒక బాలుడ్ని తోటి విద్యార్థులు దారుణంగా వేధించారు. దుస్తులు విప్పించి అతడ్ని కొట్టడంతోపాటు మలద్వారంలో కర్రను చొప్పించారు. దీంతో ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. (Boy Assaulted By Classmates) మార్చి 18న ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడి పట్ల క్లాస్మేట్స్ దారుణంగా ప్రవర్తించారు. క్లాస్ రూమ్ నుంచి అతడ్ని బయటకు తీసుకెళ్లారు. దుస్తులు విప్పించి కర్రతో కొట్టారు. ఆపై కర్రను అతడి మలద్వారంలోకి చొప్పించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించాడు.
కాగా, ఈ సంఘటన వల్ల ఆ బాలుడి పేగులు దెబ్బతిన్నాయి. తీవ్ర కడుపు నొప్పితో బాధపడటంతో అతడి పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలుడి పేగులు దెబ్బతిన్నాయని, సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో ఏం జరిగిందని తల్లి అడగ్గా జరిగిన దారుణం గురించి అతడు చెప్పాడు. సర్జరీ చేయడంతో నెల రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆ బాలుడు ఇటీవల ఇంటికి చేరుకున్నాడు.
మరోవైపు తన కుమారుడికి జరిగిన వేధింపుల పట్ల అతడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. అలాగే స్కూల్ యాజమాన్యం, అధికారులు కూడా తగిన చర్యలు చేపట్టాలని కోరింది. భయానక సంఘటన వల్ల తన కుమారుడు నిద్రలో లేచి ఉలిక్కి పడుతున్నాడని వాపోయింది. అలాగే మూడు నెలల తర్వాత మరో సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- assaulted
- Boy
- classmates
- Damaged
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

