Ananya Panday | రెండేళ్లకే బ్రేకప్.. బాలీవుడ్లో వైరల్‌గా మారిన లైగర్ భామ లవ్ ఫెయిల్యూర్!
Ananya Panday | బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేర్లలో అనన్య పాండే ఒకరు. చేసిన సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో ఆమె ప్రేమాయణంపై కొద్దిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి.
Ananya Panday | బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేర్లలో అనన్య పాండే ఒకరు. చేసిన సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో ఆమె ప్రేమాయణంపై కొద్దిరోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. చాలా రోజులుగా వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీల్లో కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ నిజంగానే లవ్ బర్డ్స్ అని బీటౌన్ కన్ఫార్మ్ చేసేసింది. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోయిందట. రెండేండ్ల ప్రేమకు వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పారనే వార్త ఇప్పుడు బీటౌన్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఆదిత్యరాయ్ కపూర్, అనన్య బ్రేకప్ విషయాన్ని వాళ్ల సన్నిహితుడు ఇటీవల ధృవీకరించాడు. ఒక చిట్‌చాట్‌లో పాల్గొన్న అతను.. ఆదిత్య, అనన్య ఇద్దరూ నెల క్రితం విడిపోయారని క్లారిటీ ఇచ్చారు. వాళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా ఉండేవారని.. ఒకరితో మరొకరు చాలా అన్యోన్యంగా ఉండేవారని చెప్పాడు. కానీ ఇలా సడెన్‌గా విడిపోవడం మా అందరికీ షాకిచ్చిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం అనన్య మూవ్ ఆన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుందని అన్నాడు. బ్రేకప్ గాయం ఆమెకు గట్టిగా తగిలిందని.. ఆ బాధను మరిచిపోయేందుకు పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడుపుతోందని చెప్పాడు. ఆదిత్యరాయ్ కపూర్ కూడా మెచ్యూరిటీతో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నాడు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే చివరిసారిగా కలిసి కనిపించారు. ఆ తర్వాత ఎక్కడ కూడా జంటగా కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొని ముంబై వచ్చిన తర్వాతే తమ రిలేషన్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారట. అనన్య సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం మార్చిలోనే వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

