శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 06, 2020 , 19:03:08

లలితా జ్యువెల్లర్స్ విరాళం రూ.కోటి

లలితా జ్యువెల్లర్స్ విరాళం రూ.కోటి

హైదరాబాద్‌: కరోనా నివారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలకు పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నాయి. కరోనాపై పోరు కోసం లలితా జ్యువెల్లర్స్ సీఎంఆర్ఎఫ్‌కు  రూ. కోటి విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును లలితా జ్యువెల్లర్స్ సీఎండీ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ సీఎంకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు  కూడా చెరో కోటి రూపాయల విరాళాన్ని కిరణ్ కుమార్ ప్రకటించారు. 

కరోనా వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌  వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ రూ.40 కోట్ల విరాళం ప్రకటించింది. సంబంధిత చెక్కును సింగరేణి సీఎండీ  ఎన్. శ్రీధర్ సీఎం  కేసీఆర్‌కు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాతలందరికీ ధన్యవాదాలు తెలిపారు.


logo