ముంబై: ఇండియన్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మతో కలిసి చేసిన భాంగ్రా డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన గంటలోపే లక్షల సంఖ్యలో లైక్స్, వందల కామెంట్స్ రావడం విశేషం. భాంగ్రా ఇన్ గబ్బర్ స్టైల్ అంటూ ధనశ్రీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా చాహల్‌తోనే ఉన్న సందర్భంలో ధనశ్రీ ఈ డ్యాన్స్ వీడియో చేసింది. ఆ సిరీస్ ముగిసిన తర్వాత చాహల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్‌లో చేరడానికి వెళ్లగా.. ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోకి వెళ్లాడు.
ఇవి కూడా చదవండి..