తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కేవలం సినిమాలు మాత్రమే చేయడం లేదు.. బిజినెస్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సంపాదించిన మొత్తం అక్కడ పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు థియేటర్ బిజినెస్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. ఈ విషయంలో మహేష్ బాబు అందరికంటే ముందున్నాడు. ఏఎంబీ సినిమాస్ పేరుతో మూడేళ్ల కింద ఈయన నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద థియేటర్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు ఇదే ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. తన సొంత ఊరు మహబూబ్ నగర్లో AVD సినిమాస్ పేరుతో ఒక మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నాడు. దీని నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఏప్రిల్ 9న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. ఏషియన్ సినిమా భాగస్వామ్యంతో అమీర్‌పేట సత్యం థియేటర్ స్థలంలో AAA సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.
ఇప్పటికే సగానికిపైగా థియేటర్ నిర్మాణం పూర్తయింది. డిసెంబర్‌లోపు మొత్తంగా పూర్తవుతుందని.. వచ్చే సంక్రాంతికి ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్‌తో పోలిస్తే అన్ని విధాలుగా ఇది అత్యున్నతంగా ఉండేలా అల్లు అర్జున్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. దీని కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు.
హైదరాబాద్‌లోనే కాదు సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ గా ఇది ఉండాలని భావిస్తున్నాడు బన్నీ. దానికి తగ్గట్లుగానే భారీ పెట్టుబడి కూడా పెడుతున్నాడు. ఇదంతా చూస్తుంటే కేవలం బాక్సాఫీస్ దగ్గర కాదు బిజినెస్ లో కూడా మహేష్ బాబుకు పోటీగా వెళ్తున్నాడు అల్లు అర్జున్.
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
నేను సున్నితమైన వ్యక్తిని: అదితీరావు హైదరి