శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 02:03:21

రుణ యాప్‌ వేధింపులకు మరొకరు బలి

రుణ యాప్‌ వేధింపులకు మరొకరు బలి

  • తీసుకున్నది లక్ష.. చెల్లించింది రూ. 2.5 లక్షలు

కుత్బుల్లాపూర్‌, జనవరి 2: లోన్‌ యాప్‌ కాల్‌సెంటర్ల వేధింపులకు మరొకరు బలయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుజ్జ చంద్రమోహన్‌(39)కు భార్య సరిత, ముగ్గురు పిల్లలు ఉన్నా రు. వీరు 15 ఏండ్లుగా మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉం టున్నారు. చంద్రమోహన్‌ ఓ ప్రైవేటు దవాఖానలో లేబర్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా సరిత కూడా అక్కడే పని చేస్తున్నది.  ఇటీవల 11 యాప్‌ల ద్వారా రూ.లక్ష అప్పుగా తీసుకొన్నారు. కాల్‌సెంటర్ల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తుండటంతో అప్పు చేసి రూ.2.5 లక్షలు చెల్లించాడు. వేధింపులు ఆగకపోవడంతో చంద్రమోహన్‌ శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


logo