సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 13:23:45

అదానీ, అంబానీల కోసమే వ్యవసాయ చట్టాలు : సురవరం

అదానీ, అంబానీల కోసమే వ్యవసాయ చట్టాలు : సురవరం

హైదరాబాద్‌ : నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే తీసుకువచ్చిందని సీపీఐ జాతీయ నేత సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని ముఖ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ 96వ వ్యవసాయపక దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జెండా ఎగుర వేసిన ఆవిర్భావ వేడుకలను సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్‌ పెట్టుబడిదారులకే చౌకీదార్‌ అన్నారు. సందర్భంగా సురవరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ తర్వాత సీపీఐకే సుదీర్ఘ చరిత్ర ఉంది సీపీఐకే ఉందన్నారు. దున్నేవాడిదే భూమి పోరాటం చేసింది సీపీఐ పార్టీనని పేర్కొన్నారు. కన్నీళ్లు, ఆకలి ఉన్నన్ని రోజులు వామ పక్ష పార్టీలు ఉంటాయని, పార్లమెంటరీ వ్యవస్థలో గెలుపోటములు సహజమేనన్నారు. కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. 80వేల ట్రక్కులతో లక్షలాదిమంది రైతులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. బోగస్‌ రైతులతో ఉద్యమాన్ని నీరుగారే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.