Supreme Court: పేపర్ బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు: సుప్రీంకోర్టు
Supreme Court: మళ్లీ పేపర్ బ్యాలెట్ కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిచూడడం కూడా కుదరదు అని కోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండబోదు అని సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ తన తీర్పులో స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఈవీఎంలలో ఓట్లతో పాటు వీవీప్యాట్ల స్లిప్‌లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఆ పిటీషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ అభ్యర్థలను తోసిపుచ్చింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో పోలైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్‌లను వంద శాతం సరిచూసుకోవాలని చేసిన డిమాండ్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్లతో వంద శాతం క్రాస్ వెరిఫికేషన్ కుదరదని కోర్టు చెప్పింది. ఈవీఎంల స్థానంలో మళ్లీ పేపర్ బ్యాలెట్లను వాడాలన్న అభ్యర్థనను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. వీవీప్యాట్ల ఫిజికల్ డిపాజిట్ కూడా కుదరదు అని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

